Search
Wednesday 14 November 2018
  • :
  • :

క్రికెట్ ఆణిముత్యం వాడేకర్..

Ajit Wadekar was one of Indian athletes for Indian cricket

మన తెలంగాణ/ క్రీడా విభాగం: భారత క్రికెట్‌కు లభించిన ఆణిముత్యాల్లో అజిత్ వాడేకర్ ఒకరు. క్రికెటర్‌గా, కెప్టెన్‌గా, మేనేజర్, ప్రధాన కోచ్‌గా, చీఫ్ సెలెక్టర్‌గా వాడేకర్ భారత క్రి కెట్‌కు ఎంతో అమూల్యమైన సేవలు అందించారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వాడేకర్ బుధవా రం రాత్రి ముంబయిలో మృతి చెందారు. ఆయన మృతి భారత క్రికెట్ రంగాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 77 ఏళ్ల వా డేకర్ భారత్‌లోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరిగా నిలిచారు. అంతేగాక వన్డే క్రికెట్‌లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి క్రికెటర్‌గా వాడేకర్ అరుదైన ఘనతను సాధించా రు.196674 కాలంలో వాడేకర్ క్రికెటర్‌గా టీమిండియాకు సేవలు అందించారు. కెప్టెన్‌గా, క్రికెటర్‌గా వాడేకర్ భారత క్రికెట్‌పై తనదైన ముద్ర వేశారు. వన్‌డౌన్‌లో దిగే వాడేకర్ ఆ స్థానంలో అద్భుతంగా ఆడేవాడు. అంతేగాక అద్భుత స్లిప్ ఫీల్డర్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు. వాడేకర్ సారథ్యంలోనే భారత్ తొలిసారిగా టెస్టుల్లో విదేశి సిరీస్‌లను సాధించింది. 1971లో విండీస్‌పై, ఇంగ్లండ్‌పై భారత్ చారిత్రక సిరీస్‌లను గెలిచుకుంది.

భారత్ విదేశాల్లో టెస్టు సిరీస్ గెలవడం అప్పట్లో ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా, 1958లో ఫస్ట్ క్లాస్ క్రి కెట్ ఆడడం ప్రారంభించిన వాడేకర్ టెస్టుల్లో ప్రవేశం కోసం 1966 వరకు నిరీక్షించక తప్పలేదు. దేశవాళి క్రికెట్‌లో అద్భుతంగా రాణించినా అతనికి టీమిండియాలో చోటు కోసం చా లా ఏళ్ల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. 37 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన వాడేకర్ 31.07 సగటుతో 2113 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం, మరో 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రెండు వన్డేల్లో మాత్రమే భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇందులో 73 పరుగులు సాధించా డు. కాగా, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మాత్రం వాడేకర్‌కు మెరుగైన రికార్డు ఉంది.

237 మ్యాచులు ఆడిన వాడేకర్ 15380 పరుగులు చేశాడు. అతని సగటు 47.03. కాగా వాడేకర్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 36 శతకాలు, 84 అర్ధ శతకాలు సాధించాడు. దీం తోపాటు వన్డేల్లో భారత్‌కు తొలి కెప్టెన్‌గా కూడా వాడేకర్ ఉ న్నాడు. కాగా, భారత క్రికెట్‌లోని అంతర్గత కుమ్ములాటలకు తట్టుకోలేక వాడేకర్ అర్ధాంతరంగా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మరోవైపు వాడేకర్‌కు 1967లో అర్జున, 1972లో ప ద్మశ్రీ అవార్డులతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. క్రికెట్‌కు వీడ్కోలు పలికినా మేనేజర్‌గా, కోచ్‌గా, చీఫ్ సెలెక్టర్‌గా వాడేక ర్ జట్టుపై తనదైన ముద్ర వేశాడు. 1990లో ఎంతో మంది ప్ర తిభావంతులైన క్రికెటర్లను వెలుగులోకి తెచ్చిన ఘ నత, ద్రవిడ్, గంగూలీ, సెహ్వాగ్, రైనా తదితరులను భారత్‌కు పరిచయం చేసిన ఘనత వాడేకర్‌కు దక్కుతుంది.

ఘన నివాళులు…
అకాల మరణం పొందిన క్రికెట్ దిగ్గజం అజిత్ వాడేకర్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నివాళులు అందజేశారు. ఐసిసి, బిసిసిఐ, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు, పిసిబి, క్రికెట్ సౌతాఫ్రికా, క్రికెట్ ఆస్ట్రేలియా, కరీబియన్ క్రికెట్ బోర్డులు వాడేకర్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. ఆయన మృతి క్రికెట్ లోకానికి తీరని లోటని అభిప్రాయపడ్డాయి. మరోవైపు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిం ద్, ప్రధాని నరేంద్ర మోడి, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయు డు, కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తదితరులు వాడేకర్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, ప్రసన్న, బిషన్ సింగ్ బేడి, చంద్రశేఖర్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, వివిఎస్.లక్ష్మణ్, శ్రీనాథ్, కపిల్‌దేవ్, ద్రవి డ్, వెంకటేష్ ప్రసాద్, ప్రస్తుత క్రికెటర్లు రైనా, కోహ్లి, పుజా రా,రహానె తదితరులు కూడా వాడేకర్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారత క్రికెట్‌కు వాడేకర్ అందించిన సేవలను ట్వీటర్ వేదికగా కొనియాడారు.

Comments

comments