Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ఏఎన్నార్ అంత కూల్‌గా…

Akhil Akkineni begins shooting for Venky Atluri film

అఖిల్ నటించిన తొలి రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అందుకే మూడో సినిమాతో ఎట్టి పరిస్థితిలోనైనా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటి ప్రేక్షకులను మెప్పించాలని అఖిల్ ఎంతగానో శ్రమిస్తున్నాడు. ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో అతను తన మూడో చిత్రాన్ని చేస్తున్నాడు. ప్రస్తుతం లండన్ పరిసరాల్లో సరదా ట్రిప్‌లా ఎంజాయ్ చేస్తూ సినిమా టీమ్ షూటింగ్ చేస్తోంది. ఇప్పటికే మెజారిటీ పార్ట్ చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు ఆసక్తికర విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. విదేశీ బ్యాప్‌డ్రాప్‌లో లవ్‌స్టోరీ కాబట్టి ఓవర్సీస్‌లో అఖిల్ మార్కెట్‌కు కలిసొస్తుందని ఫిల్మ్‌మేకర్స్ భావిస్తున్నారు. ఇకపోతే లండన్ నేపథ్యంలో సినిమా తీస్తే అక్కడ ఖర్చయిన మొత్తంలో సగాన్ని అక్కడి ప్రభుత్వం తిరిగి ఇచ్చేస్తుంది. ఈమేరకు నిర్మాతలు పక్కా ప్రణాళికతో సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ పాత్రలో ఓ ట్విస్ట్ ఉంటుందట. బ్లాక్‌బస్టర్ హిట్ ‘ప్రేమనగర్’లో  తాత ఏఎన్నార్  పాత్ర స్ఫూర్తితో అఖిల్ పాత్రను తీర్చిదిద్దారట. ఏఎన్నార్ అంత కూల్‌గా అఖిల్ కనిపిస్తాడట. మిస్టర్ మజ్ను అనే టైటిల్‌ను పరిశీలిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయనున్నారు.

Comments

comments