Home సినిమా అఖిల్ కొత్త చిత్రం షురూ

అఖిల్ కొత్త చిత్రం షురూ

Akhil Akkineni
అఖిల్ అక్కినేని హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నం.5గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ దేవాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. బన్నీ వాసు, వాసు వర్మలు నిర్మాతలుగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాగార్జున, అమల దంపతులు, చిరంజీవి, సురేఖ దంపతులు, అల్లు అరవింద్, నిర్మల దంపతులు, పరుశురామ్, శ్రీకాంత్ అడ్డాల, మారుతి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాగార్జున గౌరవ దర్శకత్వం వహించగా… అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ కెమెరా స్విచ్చాన్ చేయగా, అల్లు అరవింద్ మనవరాలు బేబి అన్విత క్లాప్ కొట్టారు. ఇక హలో, మిస్టర్ మజ్ను లాంటి లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ తర్వాత అక్కినేని అఖిల్ నటిస్తున్న మూడవ చిత్రమిది. ఇక ఈ చిత్రం నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర వివరాలను త్వరలో తెలియజేస్తామని చెప్పారు నిర్మాతలు.

Akhil Akkineni starts the new film in Film Nagar