Home సినిమా ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్!

ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్!

Akhil-Shreyaయంగ్ హీరో అక్కినేని అఖిల్, ఫ్యాషన్ డిజైనర్ శ్రియ భూపాల్ నిశ్చితార్థం డిసెంబర్ 9న జరుగనున్న విషయం తెలిసిందే. అయితే నాగార్జున తన చిన్న కొడుకు అఖిల్ పెళ్లిని హైదరాబాద్‌లోనే సింపుల్‌గా చేద్దామని అనుకుంటే…. శ్రియ ఫ్యామిలీ వారు మాత్రం అత్యంత గ్రాండ్‌గా చేద్దామని నిర్ణయించారట. అఖిల్, శ్రియ భూపాల్‌ల పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్‌గా చేయాలని సంపన్నులైన శ్రియ కుటుంబంవారు నిశ్చయించారని సమాచారం. ఇప్పటికే ఇటలీలోని రోమ్ తదితర నగరాల్లో అనువైన ప్రదేశాలను వెడ్డింగ్ కోసం వెతకగా అందులో ఒక వేదికను ఫైనల్ కూడా చేశారని తెలిసింది. వచ్చే ఏడాది వేసవిలో జరిగే ఈ పెళ్లికి దాదాపు 600 మంది గెస్టులు వస్తారని సమాచారం. వారందరికీ సెవెన్ స్టార్ ఆతిథ్యంతో పాటు ఇటలీలో నాలుగు రోజుల పాటు గ్రాండ్ రిసప్షన్‌ను కూడా నిర్వహిస్తారట.