Search
Sunday 23 September 2018
  • :
  • :

డిసెంబర్ 9న అఖిల్ నిశ్చితార్థం.. చైతు పెళ్లి వచ్చే ఏడాది!

Akkineni-Family-Marriageహైదరాబాద్: అక్కినేని వారి ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. తన కుమారులు నాగచైతన్య, అఖిల్ ఎప్పుడంటే అప్పుడు పెళ్లి చేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని సినీ నటుడు నాగార్జున స్పష్టం చేశారు. అంతేకాకుండా నాగచైతన్య-సమంత బంధంపై గత కొంత కాలంగా కేవలం మీడియాలో మాత్రమే వినిపిస్తున్న వార్తలకు ఆయన స్పష్టత ఇచ్చారు. చైతూ జీవితభాగస్వామి గురించి విలేక్రులు నాగార్జునను ప్రశ్నించగా.. ‘రోజూ మీరు రాస్తున్నారుగా. ఇక ఆ అంశం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుమారుల సంతోషం కంటే ఏదీ ఎక్కువ కాదు. అఖిల్ నిశ్చితార్థం మాత్రం డిసెంబర్ 9న జరుగుతుంది. ఇక నాగచైతన్య ఎప్పుడంటే అప్పుడు పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బహుశా వచ్చే ఏడాది పెళ్లి ఉండవచ్చేమో!’ అని అన్నారు.
గత కొంతకాలంగా సమంత, నాగచైతన్య ప్రేమించుకుంటున్నారు. ఈ విషయంపై ఇప్పటివరకు సమాధానం దాటవేస్తూ వచ్చిన నాగార్జున తొలిసారి స్పందించారు. మరోపక్క శ్రేయా భూపాల్ అనే ఫ్యాషన్ డిజైనర్‌తో అఖిల్ ప్రేమలో ఉన్నారు. అఖిల్ కోరిక మేరకే డిసెంబర్ 9న నిశ్చితార్థం ఏర్పాటు చేయనున్నట్లు నాగార్జున తెలిపారు.

Comments

comments