Home సినిమా నేడే జ్యూక్ బాక్స్…

నేడే జ్యూక్ బాక్స్…

Akhil Mr Majnu Movie Audio Jukebox Release 

అఖిల్ అక్కినేని హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్టర్ మజ్ను’. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి జనవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన పాటలు, టీజర్‌కు చాలా మంచి స్పందన వస్తోంది. ఏమైనదో… ఏమైనదో, హార్ట్ బ్రేక్… పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. సోమవారం ఉదయం 10 గంటలకు సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం జ్యూక్ బాక్స్‌ను విడుదల చేయబోతున్నారు. అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతంః తమన్, పాటలుః శ్రీమణి, సినిమాటోగ్రఫీః జార్జ్ సి.విలియమ్స్, ఎడిటింగ్‌ః నవీన్ నూలి, ఆర్ట్‌ః అవినాష్ కొల్లా, కొరియోగ్రఫీః శేఖర్.

Akhil Mr Majnu Movie Audio Jukebox Release