Search
Wednesday 21 November 2018
  • :
  • :

యూత్‌ఫుల్ లుక్

Mr.Majnu

అక్కినేని అఖిల్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ చిత్రానికి సంబంధించి అఖిల్ కొత్త స్టిల్, పోస్టర్‌ను విడుదల చేశారు. అఖిల్ సరసన యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః జార్జ్ సి.విలియమ్స్, సంగీతంః థమన్, పాటలుః శ్రీమణి, ఎడిటింగ్‌ః నవీన్ నూలి, అనినాష్ కొల్లా, కొరియోగ్రఫీః శేఖర్.

Akhil’s Youthful Look in Mister Majnu Movie 

Telangana News

Comments

comments