Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

బాలీవుడ్‌లోకి అఖిల్

akil

అక్కినేని అఖిల్ బాలీవుడ్ హీరోలా ఉంటాడని అక్కినేని అభిమానులు చెబుతూ ఉంటారు. ఇప్పుడు వారి మాట నిజమవుతోంది. త్వరలో అతను ఓ బాలీవుడ్ మూవీలో నటించబోతున్నాడని సమాచారం. అఖిల్ హీరోగా బాలీవుడ్ క్రేజీ నిర్మాత కరణ్‌జోహార్ ఓ సినిమాను నిర్మించబోతున్నాడట.  హీరో ఆది పినిశెట్టి సోదరుడు సత్య చెప్పిన స్టోర్ లైన్‌ను అఖిల్… కరణ్‌జోహార్‌కు చెప్పాడట. ఈ స్టోరీ లైన్ నచ్చడంతో ఇద్దరు స్క్రిప్ట్ అసిస్టెంట్లను ఇచ్చి పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్ చేయించాడట కరణ్. ఇప్పుడు ఆ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తారు. ఈ సినిమా మొత్తం గుర్రపు పందాల చుట్టూ తిరుగుతుంది. గుర్రపు పందాల గురించి పూర్తిగా తెలుసుకొని సత్య ఈ స్క్రిప్ట్ తయారుచేశాడట. అఖిల్ నాలుగవ సినిమాగా ఇది రాబోతోంది. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేస్తున్నాడు. భోగవల్లి ప్రసాద్ దీనికి నిర్మాత. దాని తర్వాత కరణ్‌జోహార్ సినిమాలో అఖిల్ నటిస్తాడు.

Comments

comments