Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

అఖిల్ సినిమాకు ముచ్చటగా ముగ్గురు!

Akhilచూస్తుంటే అఖిల్ సినిమా రికార్డుల్లో నిలిచేలా కనిపిస్తోంది. ఈ సినిమా కోసం ఇప్పటికే భారీగా ఖర్చు పెట్టేస్తున్నాడు నిర్మాత నితిన్. దీనికి తగ్గట్టే ఏ డెబ్యూ హీరో చేయలేని బిజినెస్ అఖిల్ చేసి చూపిస్తున్నాడు. దాదాపు 45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ సినిమా చేసిందని సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పుడు అఖిల్ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాకు మణిశర్మ రీ-రికార్డింగ్ ఇస్తున్నాడని తెలిసింది. ఒకప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా చక్రం తిప్పిన మణిశర్మ… ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు ఆర్‌ఆర్ ఇస్తున్నాడు. ఆమధ్య మహేష్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ఎన్టీఆర్ ‘టెంపర్’ సినిమాలకు ఆర్‌ఆర్ ఇచ్చింది ఆయనే. ఇప్పుడు అఖిల్ సినిమాకు కూడా మణిశర్మే రీ-రికార్డింగ్ ఇస్తున్నాడు. ఇక ఈ సినిమాకు తమన్‌తో కలిసి అనూప్‌రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. అంటే ఇప్పుడు మణిశర్మ అఖిల్ సినిమాకు ముచ్చటగా మూడో మ్యూజిక్ డైరెక్టర్ అన్నమాట. ఇక సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఈ సినిమా ఆడియోను విడుదల చేయనున్నారని తెలిసింది.

Comments

comments