Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

విజయ దశమికి అఖిల్ సినిమా

Akhil,-Sayesha-saigalనాగార్జున తనయుడు అఖిల్ అక్కినేనిని హీరోగా పరిచయం చేస్తూ వి.వి.వినాయక్ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో హీరో నితిన్ సమర్పిస్తున్న భారీ చిత్ర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. మంగళవారం నుండి హైదరాబాద్ సంఘీ ఫారెస్ట్‌లో కోట్లాది రూపాయల వ్యయంతో వేసిన భారీ సెట్‌లో ఫైట్ మాస్టర్ రవివర్మ సారధ్యంలో క్లైమాక్స్ చిత్రీకరణను ప్రారంభించారు. ఈనెల 23 వరకు ఈ క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతుంది. దీంతో మూడు పాటలు మినహా చిత్రం పూర్తవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత నితిన్ మాట్లాడుతూ “ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 12 వరకు యూరప్‌లో రెండు పాటలు చిత్రీకరిస్తాం. సెప్టెంబర్ 18 నుండి 23 వరకు హైదరాబాద్‌లోని భారీ సెట్స్‌లో చివరి పాటను చిత్రీకరించడంతో మొత్తం షూటింగ్ పూర్తవుతుంది.

ఈనెల 29న నాగార్జున బర్త్‌డేకి ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేస్తాం. అలాగే అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా సెప్టెంబర్ 20న భారీ ఎత్తున ఆడియోను ఆవిష్కరిస్తాం. అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విజయదశమి కానుకగా సినిమాను చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తాం”అని అన్నారు. హీరోయిన్ సయేష్ మాట్లాడుతూ “ఆగస్టు 12 నా బర్త్‌డే. ఇంత పెద్ద బ్యానర్‌లో సినిమా చెయ్యడం, ఇంత భారీ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటుండడం నాకు నిజంగా హ్యాపీ బర్త్‌డే ఇది. అఖిల్ లాంచింగ్ ఫిల్మ్‌లో హీరోయిన్‌గా నటించే గొప్ప అవకాశమిచ్చిన వినాయక్, నితిన్‌కు నా కృతజ్ఞతలు. ఈ చిత్రం చాలా పెద్ద హిట్ అయి నా కెరీర్‌కు పెద్ద ప్లస్ అవుతుంది. అఖిల్‌తో నటించడం చాలా హ్యాపీగా ఉంది”అని చెప్పారు.

Comments

comments