Search
Wednesday 17 October 2018
  • :
  • :

నానా పటేకర్‌కు అక్షయ్ షాక్..!

Akshay fires on Tanushree Dutta Nana Patekar Controversy

ముంబయి: దేశ వ్యాప్తంగా ప్రస్తుతం #మీ టూ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సీనియర్ నటి తనుశ్రీ దత్తా నటుడు నానా పటేకర్ పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో మొదలైన ఈ ఉద్యమం తాజాగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖల బాగోతాలను బయటపెడుతోంది. లైంగిక వేధింపుల ఆరోపణలతో సతమతమవుతున్న నానా పటేకర్ కు బాలీవుడ్ యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం అక్షయ్‌ హౌస్‌ఫుల్‌ సిరీస్ లోని ‘హౌస్‌ఫుల్‌ 4’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో నానా పటేకర్‌ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కానీ గత కొన్ని రోజులుగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న పటేకర్ తో కలిసి తాను పనిచేయలేనని చెప్పారు. అంతేగాక ఆయన కేసు విచారణ పూర్తయ్యేవరకూ చిత్ర షూటింగ్ ను నిలిపివేయాలని అక్షయ్‌ మూవీ యూనిట్ ను కోరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో చేసిన పోస్ట్ ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది.

అక్షయ్ ట్వీట్ సారాంశం.. “గురువారం రాత్రి నేను ముంబయి వచ్చాను. రాగానే నానాపై వస్తున్న లైంగిక వేధింపులపై వస్తున్న వార్తలను చదివాను. అవి నన్ను తీవ్రంగా కలిచివేశాయి. అందుకే ఆయనపై విచారణ పూర్తయ్యేవరకు ‘హౌస్‌ఫుల్‌ 4’ మూవీ షూటింగ్ నిలిపివేయాలని చిత్ర నిర్మాతలను కోరాను.ఎందుకంటే ఇది చూసీచూడకుండా వదిలివేసే మామూలు విషయం కాదు అనేది నా అభిప్రాయం. నిందితులపై వస్తున్న ఆరోపణలలో నిజం ఉందని తెలితే కఠిన చర్యలు తీసుకోక తప్పదు. నిందితులతో కలిసి పనిచేసే ఉద్దేశం నాకు లేదు. అలాగే ఎవరైతే వేధింపులకు గురయ్యామని చెబుతున్నారో వారి వాదనలు విన్నా తరువాత వారికి సరైన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నది నా అభిప్రాయమని చెప్పుకొచ్చారు”. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

 

Comments

comments