Home వార్తలు ‘కత్తి’ రీమేక్‌లో అక్షయ్

‘కత్తి’ రీమేక్‌లో అక్షయ్

Akshayతమిళంలో విజయ్ హీరోగా మురుగదాస్ డైరెక్షన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘కత్తి’. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి పలువురు స్టార్స్ ఆసక్తి చూపినప్పటికీ అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. అయితే ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి సర్వం సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో విజయ్ పాత్రను అక్షయ్‌కుమార్ పోషిస్తున్నాడు. కానీ ఈ చిత్రాన్ని మురుగదాస్ డైరెక్ట్ చేయడం లేదు. ఆయన ఈ చిత్రాన్ని లైకా సంస్థతో కలిసి నిర్మిస్తుండగా… మురుగదాస్ శిష్యుడు జగన్ ఈ చిత్రం ద్వారా డైరెక్టర్‌గా పరిచయ మవుతున్నాడు. ఈ చిత్రానికి మురుగదాస్ డైరెక్ట్ చేయకపోవడానికి కారణం ఆయన త్వరలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో మహేష్‌బాబుతో సినిమా చేయాల్సిఉండడమే. గతంలో మురుగదాస్ బాలీ వుడ్‌లో తీసిన గజనీ, తుపాకీ చిత్రాలు మంచి విజయం సాధించాయి.