Home తాజా వార్తలు ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేయొద్దు

ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేయొద్దు

akun sabharwal says about food products sales in multiplex theatres

హైదరాబాద్: సినిమా థియేటర్లలో తిను బండారాలపై ఎమ్మార్పీ కంటే ఎక్కువ డబ్బును వసూలు వసూలు చేయకూడదని రాష్ట్ర తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్‌ అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ల యజమానులతో అకున్ సబర్వాల్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎమ్మార్పీ కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి పదార్థం బరువును స్పష్టంగా ప్రదర్శించాలని తెలియజేశారు. కొనుగోలు చేసే ప్రతి పదార్థానికి బిల్లు తప్పనిసరి అన్నారు. జూలై 24 వరకు ధర, పరిమాణానికి సంబంధించిన స్టిక్కర్లు, అతికించుకోవచ్చని తెలిపారు. సెప్టెంబర్ 1నుంచి పదార్థాలపై ఖచ్చితమైన ధర ముద్రించాలని యజమానులకు ఆదేేశించారు.