Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

పెళ్లి చేసుకున్న అల్‌ఖైదా నేత హంజా బిన్‌లాడెన్

Washington : Al Qaeda Leader Hamza Bin Laden get Marriage

వాషింగ్టన్ : ప్రపంచాన్ని గడగడలాడించిన అల్‌ఖైదా ఉగ్రవాద నాయకుడు ఒసమా బిన్ లాడెన్ కొడుకు హంజా బిన్‌లాడెన్ పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని అతడి కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. 9/11 దాడులకు నాయకత్వం వహించిన మహ్మద్ అట్టా కూతురును హంజా పెళ్లి చేసుకున్నాడు. అల్‌ఖైదాలో హంజాకు ఉన్నత పదవి దక్కిందని, అయితే హంజాతో తమకు ప్రత్యక్ష సంబంధాలు లేవని వారు తెలిపారు. బిన్‌లాడెన్ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా ఎటువంటి చర్యలకు దిగొద్దని హంజాకు ఆయన కుటుంబ సభ్యులు సూచించారు. అల్‌ఖైదాకు గతవైభవం తెచ్చేందుకు హంజా యత్నిస్తున్నాడని వారు పేర్కొన్నారు. దీంతో హంజా ఆచూకీ తెలిసుకునేందుకు ఆయా దేశాల నిఘా సంస్థలు యత్నిస్తున్నాయి. బిన్ లాడెన్‌తో కూడా తమకు సంబంధాలు లేవని, 1999 నుంచి లాడెన్ చనిపోయే వరకు (2011) తాము అతడిని కలువలేదని వారు తెలిపారు. అయితే హంజాను అమెరికా గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించింది. ప్రస్తుతం హంజా అఫ్ఘానిస్థాన్‌లో ఉన్నట్టు అనుమానిస్తున్నారు.

Al Qaeda Leader Hamza Bin Laden get Marriage

Comments

comments