Home తాజా వార్తలు ఆత్మీయ ఆలింగనమే … అలయ్ బలయ్ : దత్తాత్రేయ

ఆత్మీయ ఆలింగనమే … అలయ్ బలయ్ : దత్తాత్రేయ

ALAY-BALAYహైదరాబాద్ : ఆత్మీయ ఆలింగనానికి ప్రతీకే అలయ్ బలయ్ అని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. శుక్రవారం జలవిహార్‌లో ఆయన అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను వెలుగులోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. అమరావతి శంకుస్థాపనలో భాగంగా తెలుగు రాష్ట్రాల సిఎంలిద్దరూ చేతులు కలపడం మంచి పరిణామని ఆయన అన్నారు. అలయ్ బలయ్ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, నాయిని, ఈటల , సిఎల్‌పి నేత జానారెడ్డి, టిడిపి నేతలు రమణ, ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డి, బిజెపి ఎమ్మెల్యే లక్ష్మణ్, ఎంపి జితేందర్‌రెడ్డి, సినీనటులు రాజేంద్రప్రసాద్, వేణుమాధవ్, జీవిత దితరులు హాజరయ్యారు. అలయ్‌బలయ్ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ ప్రధాని నరేంద్రమోడీ సందేశం పంపించారు. అలయ్ బలయ్ కార్యక్రమం ఐక్యతకు చిహ్నమని ఆయన పేర్కొన్నారు.