Home మహబూబాబాద్ మద్యంతో యువత చిమత్తు

మద్యంతో యువత చిమత్తు

mdymమహబూబాబాద్ (ఎడ్యు కేషన్): మాదకద్రవ్యాలు, మత్తు పానీయాలు లే ని సమాజం కావాలని మహాత్మాగాంధీ భారత సమాజం గురించి కలలు కన్నాడు. అలాంటిది ఈ రోజు మంచినీరు దొరకని ప్రాంతాలు చాలా నే ఉన్నాయి. కానీ మద్యం దొరకని వీధి ఎక్కడ వెతికినా కనిపించదేమో. మనిషిని మత్తు లో ముంచి విచక్షణ జ్ఞానాన్ని హరించి పశుస్థాయికి దిగజార్చే ఈ వ్యసనం మన పాలకుల చూపునకు చిన్నగా కనిపించటం మన దురదృష్టం. వారి సం కుచితత్వమే కానీ మొత్తం మీద ఇది జాతికి శాపంలా మారింది. ప్రాశ్చాత్య సంస్కృతి అనుచరణలో పార్టీ కల్చర్ యువతలో వెర్రితలలు వేస్తుంది. మొదట సరదాగానో, స్నేహితుల బలవంతంమీదనో ఈ అలవాటువైపు అడుగులు వేసి ఆ తరువాత వదిలించుకోలేని వ్యసనంగా మారటంతో జీవితాలు ఛిద్రం చేసుకునే వారు ఎందరో ఉన్నారు. దాదాపు 80శాతం ప్రజలు దారి ద్య్రరేఖకు దిగువన ఉన్న మన సమాజంలో శారీరక శ్రమ మీధనే ఆధారపడి ఉన్న కుటుంబ యజమాని ఈ వ్యసనం మీద పడితే పిల్లల పెం పకం, కుటుంబ పోషణ, ఇల్లాలి పాలిట నిజంగానే  శాపంగా పరిగణిస్తున్నాయి. చదువుకోవలసిన పిల్లలు ఏదో ఒక పనిలో చేరక తప్పని పరిస్థితిని కల్పిస్తున్నాయి. తల్లి, పిల్లలు సంపాదించినా కుటుం బపోషణకు సహకరించకుండా వ్యసనానికి బానిసై శారీరక హింసకు గురిచేయటమే కాకుండా డబ్బును లాక్కుని కుటుంబ అభివృద్ధికి నిరోధకంగా తయారై ఏదో నాటికి క్షీణించి జీవచ్ఛవంలా కుటుంబానికి గుదిబండగా మారుతున్నారు. వ్యక్తి బలహీనత ఆ కుటుంబానికి నైతికంగా మరీ ముఖ్యంగా  ఆర్ధికంగా బలహీనపరుస్తుంది. వ్యక్తి సమస్య కుటుంబ సమస్యగా, తద్వారా అదో సామాజిక రుగ్మతగా, అంతిమంగా జాతి నిర్వీ ర్యానికి దోహదం చేస్తున్నాయి. సమాజపు ఆర్ధిక మూలాలను దెబ్బతీస్తున్న ఈ వ్యసనంను ఇక ఎంత మాత్రం ఉపేక్షించకూడదు.  ఆర్థికంగా ఆరోగ్యపరంగా, నైతికంగా, సామాజికంగా మనిషిని అట్టడుగు స్థాయికి దిగజార్చి మానవ జీవితానికే అర్ధం చేసుకోలేని స్థితిలో ప్రాణాలు తీసే వ్యసనం ఖచ్చితంగా మానవత్వం మీద జరుగుతున్న దాడి అని అర్ధం చేసుకోవలసిన పరిస్థితి ఉంది. ఇంత తీవ్రమైన సమస్యను నివారించటానికి పనిచేయవలసిన ప్రభుత్వాలు ఈ రోజు దానినే అత్యధిక ఆదాయ వనరుగా నిజంగా సిగ్గుచేటు. పూర్తిగా నిషేధించిన ఈ మద్యాన్ని లైసెన్సులు ఇచ్చి మరీ వీధి వీధిన అందుబాటులో ఉంచటం, ఆలోచన ఉన్న ప్రతివారిని కలిచివేస్తుంది. మద్యం అమ్మకాలు సాగిస్తూ బెల్టు షాపులను తొలగించటానికి హడావిడి చేయటం నిజం గా హాస్యాస్పదం. దీని గురించి సమగ్రమైన చర్చ జరుగాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది. చిత్తశుద్ధితో మార్గదర్శకాలను అమలు చేస్తూ ప్రజలలో చైతన్యం తీసుకురావలసిన ఆవశ్యకత అధికారులపై ఉంది. శారీరక శ్రమ చేసే నిరక్షరాస్యు లు మాత్రమే కాకుండా ఈనాడు విద్యార్థులు కూ డా ఈ వ్యసనం దారిలో ఉండటం మనజాతి భవిష్యత్‌పై సందేహం కలిగిస్తుంది. బాధ్యతగల పౌరులుగా  దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మద్యం మహమ్మారిని కూకటివేళ్ళతో సహా నిర్మూలించే వరకు పోరాటం సాగించాల్సిన తక్షణ అవసరం అందరిపై ఉంది.