Home జగిత్యాల సిఎం కెసిఆర్ కు మందుబాబు లేఖ

సిఎం కెసిఆర్ కు మందుబాబు లేఖ

CM KCRజగిత్యాల : తెలంగాణ సిఎం కెసిఆర్ కు ఓ మందుబాబు లేఖ రాశాడు. తమ జిల్లాలో కింగ్ ఫిషర్ బీరు దొరకడం లేదని, ఈ బీర్లను తమ ప్రాంతానికి సరఫరా చేయాలని కోరుతూ లేఖ రాశాడు. అయితే ఈ లేఖను పరిషత్ ఎన్నికల బ్యాలెట్ బాక్స్ లో వేశాడు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాయికల్ మండలం మూటపల్లి గ్రామంలో ఓట్లను లెక్కిస్తుండగా ఈ లేఖ కనిపించింది. కింగ్ ఫిషర్ బీర్ల కోసం తమ జిల్లాను తిరిగి కరీంనగర్ లో కలపాలని ఆ లేఖలో మందుబాబు పేర్కొన్నాడు. తమకు కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సదరు మందుబాబు కెసిఆర్ ను కోరాడు. ఈ లేఖ ఇప్పుడు చర్చేనీయాంశమైంది.

Alcohol Lover Letter To Telangana CM KCR