Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

అన్నారంలో బ్లాక్ దంద జోరు

 Alcohol sales in the block are rising in annaram
పర్వతగిరి: మండలంలోని అన్నారం షరీఫ్ గ్రామంలో రోజు రోజు బ్లాక్ లో మద్యం అమ్మకాలు జోరుగా పెరుగుతున్నాయి. ఎన్ని సార్లు అధికారులకు ఫిర్యాదులు చేసిన, పత్రికలల్లో ప్రచూరించిన ఫలితం లేకుండా పోతుంది అని అన్నారం గ్రామ ప్రజలు అంటున్నారు. ఒక్కోక్క బీర్ 150 లిక్కర్ 140కు అమ్ముతున్నారన్ని ఫిర్యాదు చేస్తే అధికారులు మాత్రం ఎప్పుడు వచ్చిన నామ మాత్రంగా వచ్చి చూసి చూడకుండా వెలుతున్నారని, అంతల విచ్చల విడిగా బ్లాక్ లో మద్యం అమ్ముతున్న అధికారులు చోద్యం చూస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. మద్యం అమ్ముతున్న బ్లాక్ బాబులు వారికి ఎదురు ఎవరు రారనే ఉద్దేశ్యంతో విచ్చల విడిగా మద్యం అమ్ముతు సమయాన్ని బట్టి వారు రేటును మారుస్తూ అధిక ధరలకు అమ్ముతున్నారని మందు బాబులు అంటున్నారు. అధిక ధరలకు మద్యం అమ్మడమే కాకుండా మద్యం తాగే వారికి అప్పులు ఇస్తామని చెప్పి వారికి తెలియకుండానే వారు పెట్టిన అప్పులను రెండితలు చేస్తున్నారని, ఓ ప్రముఖ పాన్ షాఫ్ లో చిన్న దర్గా సమీపంలోని దుకాణంలో మద్యం ఎరులైపారుతుందని ఎన్ని సార్లు చెప్పిన, ఈ బెల్టు దుకాణంలో మద్యం తాగిన వారికి ముందు తాగండి అని చెప్పి తరువాత వారి మద్యం బాబుల ఖాతాలలో రెండింతలుగా చూపిస్తు వారిని భయ భ్రాంతులకు గురి చెస్తు అప్పుల పాలు చేస్తున్నారని మందు బాబులు అంటున్నారు. ఈ ఫిర్యాదును ఇప్పటికైన పట్టించుకోని బెల్టు షాపులను మూసివేయించాలని, అన్నారంతో వైన్‌స ఉన్న కూడ ఇటువంటి అధిక ధరలకు అమ్మడం ఎంత వరకు న్యాయమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments