Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

బడ్జెట్ ముందు అప్రమత్తత

లాభాల స్వీకరణతో స్వల్పంగా నష్టపోయిన సూచీలు

Sensex

ముంబై: కేంద్ర బడ్జెట్ ముందు రోజు మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. నేడు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించారు. పరిస్థితు లు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందిన ఇన్వెస్టర్లు కొంతమేరకు లాభాల్ని స్వీకరించడంతో బుధవారం స్టాక్ సూచీలు నష్టాలతో ముగిశాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ 68.71 పాయింట్ల నష్టంతో 35965. 02 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 21.95 పాయింట్లు  క్షీణించి 11027.70 వద్ద స్థిరపడిం ది. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఉన్నా.. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న దృష్టా సూచీలు రోజంతా నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ప్రధానంగా ఫార్మా, ఎఫ్‌ఎంసిజి, మెటల్ రంగాల కు చెందిన షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. నిఫ్టీ బ్యాంక్, ఫెనాన్షియల్ సర్వీస్ సూచీ లు తప్ప మిగతా అన్ని సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ 110 పాయింట్లు లాభపడి 27,379ల వద్ద ముగిసింది. హిందూస్థాన్ పెట్రోలియం, బిపిసిఎల్, టెక్ మహీంద్రా, కోటక్ బ్యాంక్ 1 నుంచి 3శాతం లాభపడ్డాయి. సిప్లా, యుపిఎల్, హిందూస్తాన్ యూనిలివర్, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు 3 నుంచి 4శాతం నష్టపోయాయి. ఫార్మా అత్యధికంగా దాదాపు 2 శాతం పతనమవగా.. ఎఫ్‌ఎంసిజి, మెటల్ 1.4 శాతం చొ ప్పున క్షీణించాయి. పిఎస్‌యు బ్యాంక్స్ 0.5శా తం బలపడగా, ప్రైవేట్ బ్యాంక్స్ అదే స్థాయిలో బ లహీనపడింది. నిఫ్టీ దిగ్గజాలలో డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, యుపిఎల్, హెచ్‌యుఎల్, సిప్లా, లు పిన్, ఐబి హౌసింగ్, సన్ పార్మా, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా తిరోగమించాయి. మార్కెట్ల బాటలో చి న్న షేర్లలోనూ అమ్మకాలు తలెత్తడంతో మిడ్ క్యా ప్ ఇండెక్స్ 1.3 శాతం,  స్మాల్ క్యాప్ 0.8 శా తం క్షీణించాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1731 నష్టపోగా, 1091 షేర్లు లాభపడ్డాయి. నగదు విభాగంలో మంగళవారం ఎఫ్‌పిఐ(విదేశీ పోర్ట్‌ఫోలి యో ఇన్వెస్టర్లు) రూ.105 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుతున్నారు. దేశీ ఫండ్స్(డిఐఐలు)  రూ. 282 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి.

Comments

comments