Home వార్తలు అఖిల్‌కు జోడీగా అలియాభట్

అఖిల్‌కు జోడీగా అలియాభట్

Akhil-Aliaతన తొలి చిత్రంతో నిరాశ చెందిన అక్కినేని అఖిల్ తదుపరి చిత్రంపై దృష్టిపెట్టాడు. ఈసారి ఆయన ప్రేమ కథా చిత్రాల్ని చేయబోతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే… బాలీవుడ్‌లో విజయవంతమైన ‘యే జవానీ హై దీవాని’ తెలుగు రీమేక్‌లో అఖిల్ నటించబోతున్నట్లు తెలిసింది. హిందీ చిత్రాన్ని నిర్మించిన కరణ్ జోహార్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున ఈ రీమేక్‌ను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తాడని తెలిసింది. ఇందులో కథానాయికగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలియాభట్‌ను ఎంపికచేశారట. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. రణభీర్ కపూర్, దీపికా పదుకునే జంటగా నటించిన ‘యే జవానీ హై దీవాని’ చిత్రానికి ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం చక్కటి ప్రేక్షకాదరణను సొంతం చేసుకొని భారీ కలెక్షన్లను సాధించింది.