Home సినిమా అలియాభట్‌తో వర్మ చిత్రం?

అలియాభట్‌తో వర్మ చిత్రం?

aliaఒకప్పుడు బాలీవుడ్‌లో రామ్‌గోపాల్‌వర్మకు ఎంతో క్రేజ్ ఉండేది. ఇప్పుడు ఆయన క్రేజ్ కొంత తగ్గినప్పటికీ అమితాబ్‌బచ్చన్ సైతం అడగ్గానే వర్మకు డేట్లు ఇచ్చేస్తున్నాడంటే… అతని ప్రతిభకు అంతకంటే నిదర్శనం ఏం కావాలి. నిజానికి వర్మ ‘రంగీళా’ సినిమా తీసి అందరికీ షాకిచ్చాడు. అప్పటివరకు బాలీవుడ్‌లో అలాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చాలానే వచ్చినా… ఇలాంటి హాట్ లవ్ స్టోరీ మాత్రం ఒక్కటి కూడా రాలేదు. అందుకే వర్మంటే అక్కడి హీరోయిన్‌లకు ఇప్పటికీ ఎనలేని గౌరవం ఉంది. ప్రస్తుతం సర్కార్ 3 సినిమా షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు వర్మ. ఇక తాజాగా అతను స్టార్ బ్యూటీ అలియాభట్‌కు ఒక కథ చెప్పాడట. ఇది ఆమెకు నచ్చి సినిమా చేసేందుకు ఒప్పేసుకోవడంతో ‘బ్యూటిఫుల్’ అనే టైటిల్‌తో సినిమా చేయడానికి వర్మ సిద్ధమవుతున్నాడని తెలిసింది. మొత్తానికి వర్మ పోగొట్టుకున్న చోటనే మళ్లీ రాబట్టుకోవాలని నిర్ణయించుకొని మరోసారి బాలీవుడ్‌పై గట్టిగానే ఫోకస్ చేశాడని అనిపిస్తోంది. ఇప్పుడు అతను ఏ రేంజ్‌లో విజయాల్ని అందుకుంటాడో చూడాలి.