Home సినిమా మహేష్‌కు జోడీగా అలియాభట్?

మహేష్‌కు జోడీగా అలియాభట్?

alia-bhattమహేష్‌బాబు, మురుగదాస్ కాంబినేషన్‌లో ప్రారంభం కానున్న చిత్రానికి హీరోయిన్‌గా బాలీవుడ్ తార అలియాభట్‌ను ఎంపికచేసినట్లు సమాచారం. ఇప్పటికే మురుగదాస్‌తో మహేష్ సినిమా ఖరారైన విషయం తెలిసిందే. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ సినిమా చేస్తున్న మహేష్ అది పూర్తి కాగానే ఈ సినిమా మొదలుపెడతాడు. ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 80 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా మహేష్ కెరీర్‌లో భారీ బడ్జెట్ సినిమా కాబోతోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో తన అందం, అభినయంతో మంచి క్రేజ్ సంపాదించిన అలియా… మహేష్ సరసన నటించి టాలీవుడ్‌లోనూ గ్లామరస్ తారగా ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాల్సిందే. ఇప్పటికే పలువురు బాలీవుడ్ హీరోయిన్లు మహేష్ సరసన నటించి మెప్పించారు. ఇప్పుడు అలియాభట్ ఏ మేరకు మెప్పిస్తోందో చూడాలి.