Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

నేటి తరం.. మొబైల్ మ్యాన్

                     Smart-Phone

పెబ్బేరు: నేటి తరం మను షులు మొబైల్ మ్యాన్‌గా మారారు. ప్రతి మనిషి కి మొబైల్ స్మార్ట్ ,ఆండ్రాయిడ్ ఫోన్‌లతో రోజంతా కాలక్షేపం చేసుకుంటూ గడుపుతు న్నారు. దశాబ్దం కాలం క్రితం ల్యాండ్‌ఫోన్‌ల తో సరిపెట్టుకుని క్షేమ సమాచారాన్ని తెలుసు కునేవారు. కాని నేడు ఆపరిస్థితి లేదు. ప్రపం చంలో జరుగుతున్న ప్రతి విషయం క్షణంలోనే తెలుసుకోవడంతో పెద్దపెద్ద సంఘటనలు కూ డా టేకిట్ ఈజిగా తీసుకోవడం నేటి తరం తీరు.  ఇంతకు ముందు వేసవి సెలవుల్లో అమ్మ మ్మ నానమ్మల ఇంటికి వెళ్లి ఉదయం వేళల్లో పంట పొలాలు , బావుల్లో స్నానం ,రాత్రి వేళ ల్లో వారు చెప్పే నీతి కథలు విని జ్ఞానాన్ని పెంపొందించుకునేవారు.

నేడు చిన్న పెద్దా తే డా లేకుండా స్మార్ట్ ఫోన్‌లతో కాలక్షేపాన్ని చేసుకుంటూ వాట్సాప్‌లతో షటాప్‌లుగా మా రుతున్నారు. ఇంట్లో సమస్యలు ఉన్నప్పటికి వాటిని అశ్రద్ద చేస్తు మొబైల్‌లో చార్జింగ్ ఉంటే చాలన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇంటికి బంధువులు వచ్చినా బాగున్నారా అని పలుక రించి తలలు కిందికి వేసి చాటింగ్ చేస్తు ఫేస్‌బు క్, వాట్సాప్ ,గ్రూప్‌లతో కుస్తీలు పడుతు న్నారు. డిల్లీలో సోమవారం ఉదయం ఆసు పత్రిలో కాన్పు జరిగిన మరు క్షణంలోనే కలిసి వచ్చే కాలానికి నడిసి వచ్చే కొడుకన్నట్లు గావాస్తవాన్ని మీడియా ద్వారా కళ్లముందు ఉంచారు.

Comments

comments