Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

బోనాలకు అన్ని ఏర్పాట్లు

All Arrangements for Bonalu Fistival

హైదరాబాద్ : ఈనెల 15 తేదీ నుంచి ప్రారంభమయ్యే బోనాల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. బొగ్గులకుంటలోని ధార్మిక భవన్‌లో బోనాల నిర్వహణపై గురువారం ఆయన దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లోని 14 ప్రధాన ఆలయాలకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తామని ఆయన చెప్పారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈనెల 15వ తేదీన గోల్కొండ జగదాంబ మహాంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బోనాల పండుగ ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. జులై 29న బోనాలు, జులై 30న రంగం, ఏనుగు ఊరేగింపు నిర్వహిస్తారు. హైదరాబాద్ లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారికి ఆగస్టు 5న బోనాల పండుగను, మరుసటిరోజు బోనాల ఊరేగింపును నిర్వహిస్తారు. ఈ సమీక్షలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్, అదనపు కమిషనర్ శ్రీనివాసరావు, హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, నగర సహాయక కమిషనర్లు , ఆయా ఆలయాల కార్యనిర్వహణ అధికారులు పాల్గొన్నారు.

All Arrangements for Bonalu Fistival

Comments

comments