Home తాజా వార్తలు ఉ.కొరియాపై ఒత్తిడి తీసుకురావాలి : ట్రంప్

ఉ.కొరియాపై ఒత్తిడి తీసుకురావాలి : ట్రంప్

Donald-Trump

న్యూయార్క్ : ఎటువంటి క్షిపిణి ప్రయోగాలు చేయకుండా ఉత్తర కొరియాపై ప్రపంచదేశాలన్ని తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. తొలిసారిగా ఐక్యరాజ సమితిలో ప్రసంగించిన ఆయన ఉత్తర కొరియా ఆగడాలను అడ్డుకొనేందుకు ఆసియా దేశాల కూడా అమెరికాకు మద్దతుగా నిలవాలని కోరారు. ఉ.కొరియా, ఇరాన్ దేశాల నేతలతో చర్చలు జరపాలని ప్రపంచ దేశాధినేతలను ఆయన కోరారు. మారణహోమం సృష్టిస్తున్న ఐసిస్ ఉగ్రవాదులను ఆయన ఓడిపోయినవారిగా అభివర్ణించారు.