Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

బేరం కుదిరితే గడప దాటుడే

All Party Candidates In Election Campaign

మన తెలంగాణ/సదాశివనగర్ : త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బలాబలాలు నిరూపించుకోవడానికి పలు పార్టీల నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా గ్రామ గ్రామలు తిరుగుతూ అమ్మా బాగున్నారా, అక్కా చెల్లె, అన్నా తమ్ముడు బాగున్నారా ఈసారి మీ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపించండి అంటూ వేడుకుంటున్నారు. అయితే ప్రచార సమయాల్లో ప్రజల స్పందనను గమనిస్తున్న నాయకులు తమకు అనుకూలంగా లేని వారు ఏ వర్గానికి చెందినవారు, వారిని తమవైపుకు తిప్పుకోవాలం టే ఎవరిని సంప్రదించాలి అనే దానిపై అనుచరులకు సూచిస్తున్నారు. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు రంగంలోకి దిగి సంప్రదింపులు, సాటుమాటు స మావేశాలు జరుపుకున్నారు. ఇలాంటి ప్రయత్నాలు ప్రధాన పార్టీలు రోజుకోచోట కొనసాగిస్తున్నట్లు సమాచారం గెలుపే ల క్షంగా పని చేయాలని నాయకులు ఆదేశించడంతో కొంత మం ది కాంగ్రెస్, టిఆర్‌ఎస్‌లోని ద్వితీయశ్రేణి నాయకులు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలను బేరసారాలాడుతున్నారు. తటస్థంగా ఉన్న నాయకులను పార్టీల్లో చేర్పించేందుకు అనుచరుల ద్వారా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అనువుగా భావిస్తున్న ద్వితీయశ్రేణి కార్యకర్తలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా స్థిరపడాలని భావిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో ఆశించిన స్థా యిలో డబ్బులు సర్దుబాటు చేసిన అభ్యర్థి వైపే మొగ్గు చూపుతామని కొందరు బాహాటంగా ప్రకటిస్తున్నారు. ఇలా ప్రధాన పార్టీ ల్లో కోవర్టుల బెడద అభ్యర్థులకు కంటి మీద కనుకు లేకుండా చేస్తుంది. బేరం కుదిరితే గడప దాటుడే అన్న చందంగా వ్యవహరిస్తూ పార్టీ ఫిరాయింపుల అవకాశాలు ఇట్లు తెలుస్తుంది.

All Party Candidates In Election Campaign

Telangana News

Comments

comments