Home నాగర్ కర్నూల్ లక్ష సాధనకు అన్ని మార్గాలు అన్వేషించాలి

లక్ష సాధనకు అన్ని మార్గాలు అన్వేషించాలి

All paths must be explored to achieve the goal

కలలు కనాలి వాటిని సకారం చేసుకోవాలి
రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

మన తెలంగాణ/కొల్లాపూర్:  లక్షం సాధించాలంటే అన్ని మార్గాలు అన్వేషించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పట్టణంలోని ఎస్‌ఎం గార్డెన్ పంక్షన్ హాల్‌లో కోసా, రత్నగిరి పౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గం నిరుద్యోగ యువతకు ఏర్పాటు చేసిన ఉచిత పోలీస్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో మంత్రి జూపల్లి పాల్గొన్ని మాట్లాడారు. విద్యార్థులు నిరాశ నిహృహకు గురికాకుండా పట్టుదలతో రాణించాలన్నారు.సువిశాలమైన ప్రపంచంలో అనేక వనరులు ఉన్నాయని గుర్తు చేశారు. భారత దేశం మహిళలు విదేశాలలో సిఇఓలగా పని చేస్తున్నారని అన్నారు.ప్రతి విద్యార్థి కలలు కన్నాలి వాటిని సకారం చేసుకోవాలని పిలపునిచ్చారు.ప్రతి విద్యార్థి 16గంటలు సాధన చేయాలని సూచించారు.నేడు టెక్నాలాజీ పెరిగిందని వనరులు ,అన్ని వసతులు పెరిగినట్లు మంత్రి పేర్కోన్నారు.నేడు ప్రవేటులో నెలకు లక్షలకు లక్షలు వెతనాలు వచ్చే ఉద్యోగాలు ఉన్నాయన్నారు.ప్రతి విద్యార్థి విజ్ఞానం పెంచుకోవాలని సూచించారు. కొల్లాపూర్‌కు పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.ఆర్‌ఐడి పాఠశాలపైన పాఠశాల ఏర్పాటు చేసి క్రింద ఆడిటోరియం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.6నెలలో కొల్లాపూర్ నియోజకవర్గంలో 100శాతం సిసి రోడ్లు పూర్తి అయ్యేలా చర్యలు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.రెండు రోజులో వంద పడకల ఆసుపత్రికి 12కోట్లు మంజూరు అవుతాయన్నారు.ఈసందర్భంగా విద్యార్థులకు స్టాడి మెటీరియల్ అందజేశారు. సిఐ పి.జగదీశ్వర్‌కు మంత్రి ఘనంగా సన్మానం. కొల్లాపూర్ పట్టణానికి చెందిన పి.జగదీశ్వర్ హైదరాబాద్‌లో సిఐగా చక్కగా పని చేసి ఇటివల ముఖ్యమంత్రి సర్వోన్నత పురస్కారం అందుకున్న సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా సన్మానించారు. అంకితభావంతో పని చేసి రాష్ట్ర స్థాయిలో కొల్లాపూర్‌కు మంచి గుర్తింపు తెచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు.ప్రతి విద్యార్థి జగదీశ్వర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు.ఈసందర్భంగా జగదీశ్వర్ మాట్లాడుతూ, విద్యార్థులు బావితరాలకు బాటలు వేయాలని కోరారు.
మంత్రి జూపల్లి విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం కోసం 40లక్షల రూపాయలతో షేడ్ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.ప్రతి విద్యార్థికి ఉద్యోగం వచ్చే వరకు శిక్షణ కార్యక్రమం నిరంతరం కోనసాగుతుందని అందుకు తన సహకారం అందిస్తానన్నారు.ఇక్కడ తాను ఇంత పెద్ద ఎత్తున సన్మానం చేయించుకోవడం తానుకు ఆనందంగా ఉందన్నారు.కొల్లాపూర్‌లో ఒక ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయించాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎస్సీ మురళి, ఎంపిపి చిన్న నిరంజన్‌రావు,జడ్‌పిటిసి హన్మంత్‌నాయక్,మార్కెటు యార్డు వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ ఎక్బాల్, ఇజి.ఎంఎం డైరెక్టర్ శేఖర్‌రెడ్డి, స్థానిక సిఐ సైదాబాబు, కోసా ప్రధాన కార్యదర్శి మియ్యాపురం రమేష్, అర్జున్‌గౌడ్, ప్రభాకర్‌శేట్టి, శ్రీకాంత్, టిఆర్‌ఎస్ నాయకులు నరసింహ్మరావు, రామపూరం సర్పంచ్ బాల్‌రాజు,ముక్కిడిగుండం సర్పంచ్ లోకేష్, బోరెల్లి మహేష్,రెడ్డి సత్యం, సంపంగి నరసింహ్మ,బోరెల్లి సంగెం,మేకాల రాముడు, సాయిల్‌యాదవ్,వెంకటరమణ, తమటం వెంకటస్వామిగౌడ్‌లు పాల్గొన్నారు.