Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

స్కూల్ అసిస్టెంట్ పోస్టులన్నీ జిల్లా పోస్టులే: కడియం

Kadiyam-Srihari1

హైదరాబాద్: 1992 నుంచి ఇప్పటి వరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు డిస్ట్రిక్ పోస్టులుగానే పరగణించబడుతున్నాయని డిప్యూటీ సిఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. బుధవారం ఆయన శాసనసభలో ప్రసంగిస్తూ… స్కూల్ అసిస్టెంట్ పోస్టులను జోనల్ కేడర్ పోస్టులుగా ఎక్కడా నోటిపై చేయలేదన్నారు. నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులందరికీ త్వరలో ప్రమోషన్లు ఉంటాయని స్పష్టం చేశారు. 1998-2012 వరకు అర్హత సాధించి అపాయింట్‌మెంట్ లభించిన వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 1997 లా కమిషన్ ద్వారా 480 మంది అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్లుగా నియమించబడ్డారని ఆయన చెప్పారు. 222 మంది తెలంగాణకు వచ్చారని తెలిపారు. 222మందిపై యూనిఫైడ్ సర్వీసెస్‌కు సంబంధించి ఎలాంటి వివాదం లేదని స్పష్టం చేశారు.

Comments

comments