Home తాజా వార్తలు కొండగట్టుపై ప్రమాదాలకు చెక్!

కొండగట్టుపై ప్రమాదాలకు చెక్!

Road Accidents on Kondagattuమూలమలుపు వద్ద కొరియన్ టెక్నాలజీతో రక్షణ గోడ
రేడియం స్టిక్కర్లతో కూడిన 73 హెచ్చరిక బోర్డులు
ఆధునిక టెక్నాలజీతో స్పీడు బ్రేకర్లు ఏర్పాటు
భక్తులు కొండపైకి వెళ్లేందుకు మినీ బస్సులు

మల్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఘాట్ రోడ్డుపై ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సెప్టెంబర్ 11న ఘాట్ రోడ్డులోని ప్రమాదకరమైన మూలమలుపు వద్ద ఆర్‌టిసి బస్సు అదుపు తప్పి లోయలో పడగా 65 మంది మృత్యువాతపడ్డారు. మరో 50 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. బస్సు ప్రమాదంలో పెద్దసంఖ్యలో ప్రయాణీకులు మృత్యువాత పడటం దేశంలోనే ఇదే ప్రథమం కావడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ప్రమాదానికి గల కారణాలు… ఘాట్ రోడ్డు తీరును పరిశీలించేందుకు రోడ్డు భద్రతా డిజితో పాటు వివిధ శాఖల అధికారులను అప్రమత్తం చేసింది. ప్రమాద సంఘటనపై పూర్తి స్థాయి నివేదిక అందజేయడంతో పాటు భవిష్యత్తులో ఘాట్ రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పలుమార్లు రోడ్డు భద్రతా డిజి కృష్ణప్రసాద్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్ ఘాట్ రోడ్డును పరిశీలించి చర్యలు చేపట్టారు. ప్రమాదం జరగగానే ఘాట్ రోడ్డు మీదుగా వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.

కొండగట్టుపైన చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా ను తీవ్రతరం చేశారు. బస్సు లోయలో పడ్డ మూలమలుపు వద్ద గతంలో పలు ప్రమాదాలు చోటు చేసుకుని పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన దృష్టా ఆ ప్రాంతంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రక్షణ గోడ నిర్మించడంతో పాటు వాహనాల వేగాన్ని నియంత్రించేలా స్పీడు బ్రేకర్లు, భారీ వాహనాలు ఘాట్ రోడ్డు మీదు గా రాకపోకలను నియంత్రించేందుకు రోడ్డుకు అడ్డంగా బారీకేడ్లు నిర్మించాలని రోడ్డు భద్రతా అధికారులు సూచి ంచారు. అలాగే ఘాట్ రోడ్డుపై ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో పుణేలోని ఆడోర్ నుంచి ప్రత్యేక నిపుణులు వచ్చి కొండగట్టు ఘాట్ రోడ్డును, ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదాలను ఆరికట్టేందుకు కొరియన్ టెక్నాలజీతో ఆస్ట్రేలియా, యుఎస్‌ఎ, థాయ్‌లాండ్, మలేషియా దేశాల్లో నిర్మించిన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రక్షణ గోడను ప్రమాదం జరిగిన మూలమలుపు వద్ద 40 మీటర్ల మేర నిర్మించారు. ఈ గోడ నిర్మా ణం వల్ల వాహనాలు ప్రమాదాలకు గురైనప్పుడు వాహనం నుంచి కెనెటిక్ ఎనర్జిని రొటెస్ట్ ఎనర్జీగా తయారు చేయబడుతుందని, 120 కిలో మీటర్ల వేగంలో వచ్చిన 15 టన్నుల వాహనమైనా ప్రమాదానికి గురైతే వాహ నం స్వల్పంగా దెబ్బతింటుందే తప్పా ప్రాణ నష్టం జరగకుండా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

అలాగే ఘాట్ రోడ్డుపై రేడియం స్టికర్లతో కూడిన 73 ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పా టు చేశారు. రోడ్డు చివరలో రేడియం పేయింట్ వేయడంతో పాటు పెద్ద వాహనాలు కొండపైకి ఘాట్ రోడ్డు మీదుగా వెళ్ళకుండా కొండ కింద, కొండ పైన రోడ్డుకు అడ్డంగా స్టిల్ ఫ్రేమ్ ఏర్పాటు చేశారు. వాహనాలను కంట్రోల్ చేయడానికి భూమ్ బ్యారియర్ కూడా ఏర్పాటు చేశారు. ఘాట్ రోడ్డులో ప్రమాదాల నివారణకు అధికారులు పూర్తి చర్యలు చేపట్టడంతో కొండ మీదికి ఘాట్ రోడ్డు గుండా లైట్ మోటార్ వెహికిల్స్, ద్విచక్ర వాహనాలు వెళ్తున్నాయి. స్వామి వారిని దర్శించుకునేందుకు కొండపైకి వెళ్లే భక్తులకు రెండు మినీ బస్సులు ఏర్పాటు చేసి ఘాట్ రోడ్డు మీదుగా కాకుండా నాచుపెల్లి జెఎన్‌టియు మీదుగా భక్తులను కొండపైకి చేరుస్తున్నారు. కొండపైన చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎప్పటికప్పుడు వాహనదారులకు అధికారులు సూచనలు చేస్తున్నారు.

All set for avoid Road Accidents on Kondagattu