Home తాజా వార్తలు నిఘా నీడలో ‘పోలీసు’ పరీక్షలు

నిఘా నీడలో ‘పోలీసు’ పరీక్షలు

Physical testతొలిసారిగా సాంకేతిక పరిజ్ఞానం
మార్చి 8 వరకు ఎంపిక ప్రకియ
రాష్ట్ర అడిషనల్ డిజిపి జితేందర్

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు ఎంపిక ప్రక్రియను పకడ్భందిగా నిఘా నీడలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎడిజిపి జితేందర్ పేర్కొన్నారు. తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో సాంకేతిక పరికరాల్ని ఉపయోగిస్తున్నామని ఆయన వివరించారు. పోలీసు ఎంపిక పూర్తిగా పారదర్శకంగా కొనసాగుతోందని, అభ్యర్థులు ఎవరినీ నమ్మి మోసపోవద్దని అభ్యర్థుల ఎంపికలో ప్రతి అంశం టెక్నాలజీతో ముడిపడి ఉంటుందన్నారు. ప్రతి బ్యాచ్ ఎంపిక ప్రక్రియ సమయంలో ప్రతి అంశం సిసి కెమెరాల్లో రికార్డు అవుతుందని అభ్యర్థులు గుర్తించాలన్నారు. అభ్యర్థులకు సంబంధించిన వేలు ముద్రలు తీసుకున్న తరువాతనే మైదానంలోకి అనుమతిస్తారని, అభ్యర్థులు సెల్ ఫోన్లు ఇతర వస్తువులను గ్రౌండ్‌లోకి తీసుకురావద్దని ఎడిజి వివరించారు. ఈనెల 11 నుంచి మార్చి 8వ తేదీ వరకు జరిగే ఎంపికలో ఎక్కడా ఎలాంటి అక్రమాలకు, విమర్శలకు తావులేకుండా శరీర దారుఢ్య పరీక్షలు జరిగే ప్రాంతంలో మొత్తం సిసి కెమెరాల నిఘాలో ఉంచుతున్నామని తెలిపారు. అభ్యర్థి ఎత్తు, ఛాతీని కొలిచేందుకు పూర్తిస్థాయిలో సాంకేతిక పరికరాలు డిజిటల్ మీటర్లు ఉపయోగిస్తున్నామన్నారు.

పురుష అభ్యర్థులకు 100, 800 మీటర్ల పరుగు, మహిళా అభ్యర్థులకు 100మీటర్ల పరుగుకు సంబంధించి ఆర్‌ఎఫ్‌ఐడి(రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ప్యాడ్‌లను ఉపయోగిస్తున్నామని, ఆర్‌ఎఫ్‌ఐడి ప్యాడ్‌ని అభ్యర్థికి తగిలించడం వల్ల ఎంత సమయంలో గమ్యం చేరాడనన్నది ఎకక్ట్రానిక్ పరికరాల ద్వారా ఆటోమెటిక్‌గా రికార్డు నమోదవుతుందన్నారు. షార్ట్‌ఫుట్, లాంగ్ జంప్‌ల కోసం డిజిటల్ థియోడలైట్స్‌ను ఉపయోగించనున్నామని, వీటి ద్వారా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో రాష్ట్ర పోలీస్ నియామక మండలి బోర్డ్ సర్వర్‌లో అప్లోడ్ అవుతుందన్నారు. ఎంపిక ప్రక్రియలో పాల్గొనే పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. సోమవారం ఉదయం ప్రారంభమయ్యే పరీక్షలలో వినూత్న రీతిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నామని, దీంతో ఏలాంటి అక్రమాలకు చోటులేకుండా పక్కా ప్రణాళికతో నిర్వహించనున్నామని ఎడిజి వివరించారు. అభ్యర్థి సంతకంతో కూడిన పార్ట్2 ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం అడ్మిట్‌కార్డు, ఇంటిమేషన్ లెటర్ తప్పనిసరిగా ఉంచుకోవాలని తెలిపారు. అలాగే కమ్యూనిటీ సర్టిఫికెట్ కాపీ, త్రివిధ దళాలలో పనిచేసిన మాజీ సైనికులు నో అబ్జెక్షన్ ధృవీకరణ పత్రం సమర్పించాలన్నారు. పోలీసుల ఎంపికలో సహాయం చేస్తామనే దళారుల సమాచారం అందించాలని, దళారుల సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని రాష్ట్ర ఎడిజిపి జితేందర్ తెలిపారు.

All set for physical test of Telangana police recruitment