Home బిజినెస్ సెన్సెక్స్ @ 33,600

సెన్సెక్స్ @ 33,600

stock* ఈజ్ ఆఫ్ డూయింగ్
బిజినెస్ ర్యాంక్‌తో కిక్
* మరోసారి పరుగులు పెట్టిన బుల్
* ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి
ఈక్విటీ మార్కెట్లు
* 387 పాయింట్లు లాభపడిన
బిఎస్‌ఇ సూచీ
* 10,440 వద్ద స్థిరపడిన నిఫ్టీ
* పదేళ్ల గరిష్ఠానికి
భారతీ ఎయిర్‌టెల్ షేరు

న్యూఢిల్లీ: మరోసారి బుల్ పరుగులు పెట్టింది. స్టాక్ మా ర్కెట్లు రాకెట్లలా దూసుకెళ్తూ ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన జాబితా నేపథ్యంలో సూచీలు పైపైకి ఎగబాకాయి. అదే సమయంలో ట్రేడింగ్‌లో భార తీ ఎయిర్‌టెల్ పదేళ్ల గరిష్ఠానికి చేరింది. దీంతో స్టాక్ మార్కెట్లు జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. ఆసియా మార్కెట్లు జోరుమీద ఉండడం, యూరప్ మార్కెట్లు స్థిరం గా కొనసాగడం కూడా దేశీయ సూచీలకు ఊపునిచ్చా యి. ఫెడ్ సమావేశం నేపథ్యంలో అమెరికా మార్కెట్ల ఫ్యూ చర్లు పాజిటివ్‌గా ఉండడం సెంటిమెంట్‌ను బలపరిచింది. నిఫ్టీ తొలిసారిగా 10,400 పాయింట్ల మార్క్‌ను అందు కోవడమే కాకుండా, ఆ పైన స్థిరంగా నిలబడగలిగింది. సెన్సెక్స్ కూడా కొత్త రికార్డులను నమోదు చేయడమే కా కుండా 33,600 పాయింట్ల ఎగువకు చేరుకుంది. ఆఖరి కి 387 పాయింట్లు లాభపడి 33,600 వద్ద సరికొత్త జీవ న కాల గరిష్ఠస్థాయిలో ముగిసింది. అటు నిఫ్టీ కూడా 105 పాయింట్ల లాభంతో 10,440 వద్ద స్థిరపడింది. వ్యాపారానికి అనుకూలంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 30 స్థానాలు ఎగబాకి 100వ ర్యాంకును సాధిం చింది. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ఈ జాబితా దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌కు బాగా కలిసొచ్చింది. మదుపర్లు కొనుగోళ్ల వైపు మొగ్గుచూపడంతో ఆరంభ ట్రేడింగ్ నుంచే సూచీలు లాభాల బాటపట్టాయి.
9 శాతం పెరిగిన ఎయిర్‌టెల్ షేరు
ఎన్‌ఎస్‌ఇలో భారతీ ఎయిర్‌టెల్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండి యా షేర్లు దూసుకెళ్లాయి. ఎయిర్‌టెల్ షేరు విలువ 9 శాతం ఎగబాకింది. ఎస్‌బిఐ, ఐసిఐసిఐ షేర్ల విలువ కూ డా 4శాతానికి పైగా పెరిగింది. క్రితం రోజు టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాల్లో అధ్వాన్నంగా ఉన్నప్పటికీ బుధవారం కంపెనీ షేరు మార్కెట్లో భారీ లాభాలను నమోదు చేసింది. దా దాపు దశాబ్దకాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతోపాటు ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్‌బిఐ, ఆర్‌ఐఎల్ లాభాలను నమో దు చేశాయి. డా.రెడ్డీస్, సన్‌ఫార్మా, ఐషర్, భారతీ ఇన్‌ఫ్రా టెల్ షేర్లు నష్టాల్లో ముగిసాయి. రంగాలవారీగా చూస్తే బ్యాంకులు, మెటల్స్, ఎఫ్‌ఎంసిజి, ఇన్‌ఫ్రా రంగాల స్టాకులు దూసుకుపోయాయి. అంతర్జాతీయంగా చము రు ధరలు పెరిగినా ప్రపంచ మార్కెట్లు పట్టించుకోకుండా పెరిగాయి.
లాభాల్లో ఫార్మా, ఐటి వెనకడుగు
ఎన్‌ఎస్‌ఇలో పిఎస్‌యు బ్యాంక్ సూచీ అత్యధికంగా 3.7 శాతం లాభపడింది. ఆ తర్వాత రియల్టీ, మెటల్, ప్రైవేట్ బ్యాంక్స్, ఎఫ్‌ఎంసిజి 2-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే ఫార్మా, ఐటీ రంగాలు 0.5 శాతం స్థాయిలో నీర సించాయి. నిఫ్టీ దిగ్గజాలలో భారతీ 9.2 శాతం జంప్ చే యగా, స్టేట్‌బ్యాంక్, ఐసిఐసిఐ, వేదాంతా, హిందాల్కో, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌యూఎల్, యాక్సిస్, టాటా మోటా ర్స్, ఐటిసి 5-1.5 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఐ షర్, ఇన్‌ఫ్రాటెల్, డాక్టర్ రెడ్డీస్, యూపీఎల్, హెచ్‌సిఎల్ టెక్, టెక్ మహీంద్రా, హెచ్‌పిసిఎల్, జి ఎంటర్ టైన్మెంట్, సన్ ఫార్మా, సిప్లా 4-1శాతం మధ్య క్షీణించాయి.
కొనసాగుతున్న ఎఫ్‌పిఐల అమ్మకాలు
విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంపరం కొనసాగుతూనే ఉంది. మార్కెట్లు లాభాలతో ముందుకు సాగుతున్నప్పటి కీ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐ) అమ్మకాలు జరుపుతున్నారు. గత మూడు రోజుల్లో సుమారు రూ. 1200 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నగదు విభాగంలో మంగళవారం దాదాపు రూ. 532 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. ఇక మరోవైపు గడి చిన మూడు రోజుల్లో రూ. 750 కోట్లను ఇన్వెస్ట్ చేసిన దేశీ ఫండ్స్(డిఐఐలు) మంగళవారం మరోసారి రూ. 597 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి.
గోల్డ్‌మ్యాన్ సాచ్స్ అంచనాలు
గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మ్యాన్ సాచ్స్ మార్కెట్ల పట్ల సానుకూల సంకేతాలిచ్చింది. భారత్ వృద్ధి రేటు అం చనాలను దృష్టిలో ఉంచుకుని నిఫ్టీ టార్గెట్‌ను భారీగా పెం చింది. 2018 సెప్టెంబర్ నాటికి 10,900 పాయింట్ల ను అందుకుంటుందని గతంలో చెప్పింది. ఇప్పుడు డిసెంబర్ 2018నాటికి 11,600కు చేరనున్నట్టు ప్రకటించింది. అంటే ప్రస్తుత స్థాయిల నుంచి 11శాతంపైగా నిఫ్టీ పెరిగే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. రంగాల వారీగా చూ స్తే ప్రైవేటు, పిఎస్‌యు బ్యాంకులు, ఆటోమొబైల్స్, ఇండ స్ట్రియల్స్‌పై ఓవర్‌వెయిట్‌గా, ఆయిల్ అండ్ గ్యాస్, మెట ల్స్ స్టాక్స్‌పై మార్కెట్‌వెయిట్ కొనసాగించింది.