Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ప్రణాళిక ఉంటే పనులు సానుకూలం

చాలామంది మహిళలు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. చేయడం తప్పని సరిగా కూడా ఉంటోంది. ఇల్లు, ఉద్యోగం చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంటోంది. ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారు. వీరు కొన్ని నియమాలు పాటిస్తే అటు ఇంటిని ఇటు ఆఫీసును చక్కగా నిర్వహించగలగుతారు. చేయబోయే పనిని  ముందుగా ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం  ప్రణాళిక వేసుకొంటే చాలు ఆ పని చక్కగా పూర్తవుతుంది. ఆ పని చేయడానికి పట్టే సమయాన్ని కూడా లెక్కేసుకుంటే సకాలంలో  చేసుకోగలుగుతారు.  ఒక నిర్దిష్ట ఆలోచనతో, ఏకాగ్రతతో  పనిచేస్తే ఆ పని అనుకొన్న టైములో పూర్తి కావడంతోపాటు బాగుంది అని అందరి ప్రశంసను పొందుతారు. దానికి పాటించే నియమాలు ఏమిటో చూద్దాం..

Employment

ముందుగా పనుల్లో అవసరమైనవి, తొందరగా చేయాల్సినవి ఒక చోట వరుసగా రాసుకోవాలి. ప్రాధాన్యతా పరంగా రాసుకోవాలి. ఒకే సమయంలో రెండు, మూడు పనులు మొదలు పెట్టవద్దు. ఒకటి అయినాక ఇంకొకటి చేస్తే పనులు సక్రమంగా అవుతాయి.  చేయాల్సిన పనులకి కావల్సిన సరంజామాను ముందుగానే చూసుకుని రెడీ చేసుకోవాలి. ప్రతి పనికి కొంత సమయం కేటాయించుకోవాలి. పని చేసేటప్పుడు ఇష్టపూర్వకంగా చేయాలి. కష్టమైన పని అయినా ఇష్టంగా చేస్తే అది ఎంతో తృప్తిని, సంతోషాన్ని కూడా ఇస్తుంది.

రోజంతా పని మాత్రమే చేయకుండా కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. మీకు ఇష్టమైన సినిమా చూడటమో, పాటలు వినడమో ఉంటే వాటిని తప్పకుండా చేయాలి. ఇంటి పనుల గురించి ఆఫీసులో, ఆఫీసు పనుల గురించి ఇంట్లో ఆలోచించకూడదు.ఎక్కడ ఏ సమయంలో చేయాల్సిన పనిని ఆ సమయంలో బద్దకించకుండా చేసేస్తే చాలు. పని సులువుగా అయిపోతుంది. మనసు ఆహ్లాదాన్ని పొందుతుంది.పిల్లలతో గడపాల్సిన టైమును తప్పకుండా వారికే కేటాయించండి.లేకపోతే మమ్ములను మా పేరెంట్స్ పట్టించుకోరు అన్న అభిప్రాయానికి పిల్లలు వచ్చేస్తారు.

ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే వారికూడా రోజులో కాసేపు అయినా కబుర్లు చెప్పాలి. ఆఫీసులో జరిగిన విషయాలో, ఆశ్చర్యం కలిగించినవో, ప్రయాణంలో మీరుచూసిన వింతలు, విశేషాలో, లేదా ఇంటికి అవసరమైన వాటి గురించో ఏవో విషయాలు కాసేపు వారితో పంచుకుంటే మీకు తృప్తిగా ఉంటుంది. వారికి సంతృప్తినిచ్చిన వారవుతారు. అందుకే ఒక ప్రణాళికతో ఉంటే ఇన్ని లాభాలు ఉంటాయి. అంతా విజయమే లభిస్తుంది.

Comments

comments