Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

ఆ ఒక్కడు తప్ప అందరూ సస్పెండ్!

KODELAహైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నిబంధనలు ఉల్లంఘించినందుకు  ప్రతిపక్ష నేతజగన్‌ మోహన్‌ రెడ్డి మినహా.. వైసిపి పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ కోడెల శివప్రసాద్ సస్పెండ్ చేశారు. మంత్రి యనమల రామకృష్ణుడు సభ్యుల పేర్లు ప్రకటించిన వారిని సస్పెండ్ చేయాలని కోరారు. దీంతో వైసిపి ఎమ్మెల్యేలను ఈ రోజుకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. వైసిపి అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి మినహా.. ఇతర పార్టీ సభ్యులను సస్పెండ్ చేశారు. అయితే, సభకు రాని వైసిపి ఎమ్మెల్యేలపై కూడా సస్పెన్షన్‌ వేటు వేయడం గమనార్హం. ఈ రోజు సభకు రాని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, అనిల్ కుమార్‌ యాదవ్‌పై కూడా చర్య తీసుకున్నారు.

Comments

comments