Home జాతీయ వార్తలు ఐజి, ఎఎస్పితో బిజెపి ఎంఎల్ఎ వాగ్వాదం

ఐజి, ఎఎస్పితో బిజెపి ఎంఎల్ఎ వాగ్వాదం

alhabad-mla

అలహాబాద్ : ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్ బిజెపి ఎంఎల్ఎ హర్షవర్దన్ బాజ్‌పేయి పోలీస్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. హర్షవర్ధన్ తన వాహనంలో అలహాబాద్ మాజీ చౌదరి జితేంద్రసింగ్‌ను కలవడానికి అతని ఇంటికి వెళ్లాడు. జితేంద్ర సింగ్ నివాసానికి సమీపంలో ఐజి రమిత్ శర్మ, ఎఎస్పి సుక్రుతి మాధవ్ ఎంఎల్ఎ హర్షవర్ధన్ వాహనాన్ని ఆపారు. దీంతో ఎంఎల్ఎ ఐజి, ఎఎస్పితో తగాదాకు దిగారు. అసలు పోలీసులు ఎంఎల్ఎ వాహనాన్ని ఎందుకు ఆపారన్న విషయం ఇంకా తెలియాల్సిఉంది. ఎంఎల్ఎ పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో  వైరల్‌గా మారింది.