Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

అల్లరి నరేష్ 55వ సినిమా షురూ

nrs

కామెడీ స్టార్ అల్లరి నరేష్, నిర్మాత అనిల్ సుంకర కాంబినేషన్‌లో వచ్చిన అహ నా పెళ్లంట, యాక్షన్ 3డి, జేమ్స్‌బాండ్ చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ హ్యాట్రిక్ హిట్ అనంతరం ఈ హిట్ కాంబినేషన్‌లో నాలుగవ చిత్రం రానుంది. ఎటివి సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మాణ సారధ్యంలో ‘నందిని నర్సింగ్‌హోమ్’ చిత్రంతో దర్శకుడిగా తన అభిరుచిని చాటుకున్న పి.వి.గిరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సినిమా అల్లరి నరేష్ నటిస్తున్న 55వ సినిమా కాగా… నిర్మాణ సంస్థ ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు 15వ చిత్రమిది. ఈ చిత్రానికి కెమెరాః నగేష్, కళః గాంధీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ః కిషోర్ గరికపాటి.

Comments

comments