Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

స్వచ్ఛతకు భరోసా – పెట్టుబడికి భద్రత

Allocation of 649 academic volunteers to the district

రియల్ ఎస్టేట్ రంగంలో ‘హవేలీ’ నూతన ఒరవడి                                                                                              నమ్మకమే పెట్టుబడి

జిల్లాకు 649 విద్యా వలంటీర్ల కేటాయింపు
40 రోజులు దాటినా మొదలు కానీ నియమాక ప్రక్రియ
రూ.55 లక్షల బకాయిలు

రియల్ ఎస్టేట్ రంగం అంటేనే ఒడిదుడుకులతో కూడుకున్నది. రంగురంగుల కలలు, ఊహాల్లో తేలియాడిస్తూ మాటల గారడితో కొనుగోలుదారులను తమ వైపుకు తిప్పుకుంటూ ప్రజలను ఆకర్షిస్తుంటారు. రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలో ఉన్న ఈ తరుణంలో కలలను, ఊహలను నిజం చేస్తూ ప్రజల అభిరుచులకు అనుగుణంగా రియల్ ఎస్టేట్ రంగంలో నూతన ఒరవడిని సృష్టిస్తూ భవిష్యత్‌కు భరోసా కల్పిస్తుంది “‘ హవేలీ డెవలపర్స్‌”  డబ్బులు చెట్లకు కాస్తాయనే నానుడిని నిజం చేస్తూ భూమిపై పెట్టుబడి పెడితే నష్టం రాదనేది సూక్తిని నిజం చేస్తూ ముందుకు సాగుతుంది  హవేలీ. 

మన తెలంగాణ/ఖమ్మం అర్బన్ : రియల్ ఎస్టేట్ పేరుతో భూములు పడావు పడొద్దు. రియల్ ఎస్టేట్ అంటే సిరులు కురిపించాలి కాని చిన్నబుచ్చొద్దు. ప్లాట్లు కొనుక్కున్నామంటే ఇల్లు కట్టడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. మన ప్లాటే మనకు భవిష్యత్‌లో ఇల్లు కట్టిస్తుంది. హవేలీ డెవలపర్స్‌లో పెట్టుబడి భవిష్యత్‌కు భరోసానిస్తూ ప్రజలు అభిరుచులకు అనుగుణంగా ఊహలను నిజం చేస్తూ కస్టమర్ల ఆదరణ పొందుతూ ముందుకు సాగుతుంది. రియల్ ఎస్టేట్ అంటే నగర శివారులో ఉన్న పంట భూములను బీడు భూములుగా మార్చి కంచె వేసి రాళ్లు పాతి నాలుగు రోడ్లు వేసి నీడకు కూడా చెట్లు లేకుండా చేస్తూ ప్లాట్లుగా మారుస్తున్న ఈ తరుణంలో ఓ సరికొత్త ఆలోచనతో నూతన ఆవిష్కరణలతో హవేలీ డెవలపర్స్ ముందుకు వచ్చింది. పడిపోతున్న రియల్ బూమ్‌ను ఒడిసి పట్టి భూమికి బూమ్‌తో సంబంధం లేకుండా భూమిని నమ్ముకుంటే ఎప్పటికీ చెడిపోడన్న నినాదాన్ని నిజం చేస్తూ హవేలీ డెవలపర్స్ వేసిన వెంచర్లలో చేసిన ప్రయోగాలు సత్ఫలితాలనిస్తూ కొనుగోలుదారుల నుండి మంచి స్పందన పొందుతుంది. ప్లాటు కొనుగోలుదారులు ఆందోళన చెందకుండా వాటిపై ఆదాయం ఇచ్చే మార్గాన్ని చూపిస్తుంది. ఒక్కో ప్లాటులో 11 శ్రీగంధం, 11 మలబారు వేప మొక్కలు పెంచుతున్నారు. శ్రీగంధం చెట్లు పెరిగిన అనంతరం ప్లాటు యాజమానికి ఆదాయం వచ్చేలా సంస్థ వారే మొక్కలను పెం చుతూ కొనుగోలుదారులకు భరోసా కల్పిస్తున్నారు. శ్రీగంధం చెట్లను రక్షించుకునేందుకు ప్రత్యేక నిపుణున్ని ఏర్పాటు చేసింది.

పిక్నిక్ స్పాట్‌లా రియల్ వెంచర్లు
రియల్ ఎస్టేట్ వెంచర్ అంటేనే రంగురంగుల కలలను ఊహాల్లో చూపించేది. అయితే కేవలం కలలు ఊహలుగానే మిగిలిపోకుండా వాటికి వాస్తవ రూపం కల్పిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. వెంచర్లలోకి వెళ్లగానే సేద దీరాలనిపించేలా అన్ని హంగులతో ఖమ్మం నగరానికి అతి సమీపంలోని రూరల్ మండలంలోని కాచిరాజుగూడెం వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన హవేలీ డెవలపర్స్‌ను సందర్శిస్తే అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. వెంచర్‌లోకి అడుగు పెట్టగానే రకరకాల పక్షులు. వివిధ రకాల పండ్లు చెట్లు, శ్రీగంధం, మలబార్ చెట్లతో ఆహ్వానం పలుకుతుంది. సేద తీరేందుకు పచ్చిక బయ ళ్లు, చిన్న, పెద్ద తేడాలేకుండా అందరూ సేద దీరేందుకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

హవేలీ డెవలపర్స్‌లో శ్రీగంధం ప్రత్యేకం
దేవతా వృక్షాలలో ఒకటైన ప్రపంచంలోని అత్యంత విలువైన శ్రీగంధం మొక్కలు హవేలీ డెవలపర్స్ ఏర్పాటు చేసిన వెంచర్లలో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఇతర వెంచర్లకు ధీటుగా శ్రీ గంధం మొక్కలు హవేలీలో ఎంతో చూడముచ్చటగా కనిపిస్తాయి. చెట్లకు డబ్బులు కాస్తాయి అనే దాన్ని నిజం చేసేందుకు హవేలీ డెవలపర్స్ ఎంతో కృషి చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో శ్రీ గంధం మొక్కలు రూ.50లకు దొరుకుతుండగా హవేలి డెవలపర్స్ వారు ప్రత్యేకంగా శేషాచలం అడవుల నుంచి ఒక్కొక్క శ్రీ గంధం మొక్కను రూ.1000లు వెచ్చించి తీసుకువచ్చి వెంచర్లను నాటారు. ఇతర వెంచర్ల కంటే వీరు నాటిన శ్రీ గంధం మొక్కలు రెండు సంవత్సరాలకు 15 అడుగులకు పైగా పెరిగిందంటేనే మొక్కల సంరక్షణ ఏవిధంగా జరుపుతున్నారో అర్థమవుతుంది. వినియోగదారులు పెట్టిన పెట్టుబడికి భద్రతను కల్పించేలా హవేలీ డెవలపర్స్ మొక్కలను సంరక్షిస్తూ వినియోగదారులకు నమ్మకాన్ని కలిగిస్తున్నారు. ఇప్పటికే ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ నుంచైనా తమ ప్లాట్లలో మొక్కలను చూసుకునే వీలుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగదారులకు అందిస్తున్నారు.

నమ్మకమే పెట్టుబడి
నమ్మకంతో నిజాయితీగా చేసే పనికి ఆదరణ ఎప్పుడూ ఉంటుందని, తమ వినియోగదారులకు మంచి ఫలితాలు అందించేందుకు కృషి చేస్తున్నామని హవేలీ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ సాధిక్ ఆలీ తెలిపారు. శ్రీ గంధం సాగు ప్రారంభించిన తర్వాత మా దగ్గర ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇప్పుడు గంధం చెట్ల పెరుగుదల చూసి వారే తమ స్నేహితులకు, బంధువుల ద్వారా ప్లాట్లను కొనుగోలు చేయిస్తున్నారని తెలిపారు. శ్రీగంధం, మలబారు మొక్కలను ప్రత్యేకంగా శేషాచలం అడవుల నుంచి తీసుకు వచ్చి ప్లాట్లలో నాటి వాటి నిర్వహణ బాధ్యత తామే తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. దీని వల్ల ప్లాట్లు కొన్నవారు అధైర్యపడకుండా భరోసా కల్పిస్తున్నామన్నారు. మొక్కలు నాటేందుకు అనువైన భూములను ఎంచుకుని వాటిల్లో వెంచర్లు వేసి వినియోగదారులకు ఎటువంటి నష్టం రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే 100 ఎకరాల్లో మరో నూతన వెంచర్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. పడావు పడకుండా ఆదాయం లభిస్తుందని, వారి భవిష్యత్‌కు భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. వారి అభిరుచులకు అనుగుణంగా, కలలను సాకారం చేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు.

– సయ్యద్ సాధిక్ ఆలీ
హవేలి డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్

Comments

comments