Home తాజా వార్తలు ఎపి భవన్‌ను తెలంగాణకు కేటాయించండి

ఎపి భవన్‌ను తెలంగాణకు కేటాయించండి

kcrహైదరాబాద్ : ఢిల్లీలోని ఎపి భవన్ స్థలాన్ని పూర్తిగా తెలంగాణకు కేటాయించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖ రాశారు. పూర్వపు హైదరాబాద్ రాష్ట్ర స్థలాన్ని మొత్తం తెలంగాణకే కేటాయించాలని కోరారు. ఆ స్థలంలో తెలంగాణ వాసుల కోసం సాంస్కృతిక కేంద్రం నిర్మించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎపి భవన్ స్థలానికి సంబంధించి పరిహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖలో స్పష్టం చేశారు.