Home సినిమా ఆర్మీ అధికారిగా అల్లు అర్జున్

ఆర్మీ అధికారిగా అల్లు అర్జున్

Allu-Arjun

అల్లుఅర్జున్ ప్రస్తుతం ‘డిజె దువ్వాడ జగన్నాథమ్’ చిత్రాన్ని శరవేగంగా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిల్మ్‌మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమా తర్వాత బన్నీ చేయబోయే నెక్స్ మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయి.  అల్లు అరవింద్ సారధ్యంలో లగడపాటి శ్రీధర్ రూపొందించే ఈ సినిమా కోసం ఇప్పటికే ఒక టీమ్ ప్రీ-ప్రొడక్షన్ పనులు చేస్తోంది.

ఎంతో మంది స్టార్ హీరోలకు కథలు చెప్పి చివరకు బన్నీ దగ్గర ఓకే చేయించుకున్నాడు ప్రముఖ రచయిత వక్కంతం వంశీ. ఈ చిత్రంతో అతను దర్శకుడిగా తెరంగేట్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఆర్మీ అధికారిగా కనిపిస్తాడట. అందుకే ఈ సినిమాలో పాకిస్తాన్‌తో భారత్ చేసే యుద్ధం సీన్లు పెట్టారట. ‘నా పేరు సూర్య… నా ఇల్లు ఇండియా’ అనే టైటిల్ జస్టిఫికేషన్ కోసం సినిమా ప్రారంభంలోనే 15 నిమిషాల కార్గిల్ తరహా వార్ సన్నివేశం ఉందని తెలిసింది. దానికోసం గ్రాఫిక్స్‌కు బాగానే ఖర్చుపెడతారట. ఈ సినిమాలో ఆర్మీ అధికారిగా అల్లుఅర్జున్ పూర్తిస్థాయిలో అలరిస్తాడట.