Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

స్టైలిష్ స్టార్ ముఖ్య అతిథిగా…

Taxiwala

‘గీత గోవిందం’తో తన పాపులారిటీని మరింత పెంచుకున్న యంగ్‌స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడు ‘టాక్సీవాలా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థలు జిఎ2 పిక్చర్స్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్‌కెఎన్ ఈ చిత్రంతో నిర్మాతగా రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌లు, పాటలు, ప్రమోషనల్ వీడియోలతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలను మరింత పెంచే విధంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను గ్రాండ్ లెవెల్‌లో ప్లాన్ చేశారు. ఆదివారం జరుగబోయే ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వస్తుండడం విశేషం. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘టాక్సీవాలా’ ఈనెల 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్‌కెఎన్ మాట్లాడుతూ “విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్, పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని నిర్మించాం. విజయ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా దర్శకుడు రాహుల్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఆదివారం జరుగబోయే ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. దర్శకుడు రాహుల్ , సుజిత్ విజువల్స్, జేక్స్ మ్యూజిక్, కృష్ణకాంత్ లిరిక్స్, జాషువా స్టంట్స్ ఈ చిత్రంలో హైలైట్స్‌గా నిలుస్తాయి. హిలేరియస్ సస్పెన్స్ సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈనెల 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నాం”అని అన్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, ప్రియాంక జువాల్కర్, మాళవికా నాయర్, కళ్యాణి, మధునందన్, సిజ్జు మీనన్, రవి ప్రకాష్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

Allu Arjun as Main Guest in Taxiwala Pre Release Function

Telangana News

Comments

comments