Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

2 సినిమాలు ఓకే

Allu Arjun did not say anything about the film two months

‘నా పేరు సూర్య…’ వచ్చి రెండు నెలలైనా ఇప్పటికీ తన నెక్స్ సినిమా గురించి ఏమీ చెప్పలేదు అల్లు అర్జున్. అయితే ఇప్పుడు ఆ సస్పెన్స్ ముగిసి బన్నీ కొత్త సినిమా ఏంటో తెలిసిపోయింది. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ఈ స్టార్ హీరో తన నెక్స్ సినిమా చేయబోతున్నాడు. బన్నీ సూచనల మేరకు ఈ సినిమా కథలో మార్పులు చేర్పులు చేశాడు దర్శకుడు విక్రమ్. దాంతో ఈ చిత్రం పట్టాలెక్కడమే తరువాయి. బన్నీతో ‘రేసుగుర్రం’ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ నిర్మించిన నల్లమలుపు బుజ్జి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. దాదాపు 100 కోట్లతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలిసింది. ఇక విక్రమ్ సినిమా తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కూడా లైన్‌లో ఉంది. వరుసగా సినిమాలు చేస్తూ సందడి చేస్తున్న డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత…’ తెరకెక్కిస్తున్న త్రివిక్రమ్… ఆతర్వాత వెంకటేశ్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ రెండు పూర్తయిన తర్వాత బన్నీతో సినిమాను తెరకెక్కించనున్నాడు త్రివిక్రమ్. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చాయి. ఇక డి.వి.వి.దానయ్యతో కూడా ‘దేశముదురు’ సినిమా చేశాడు అల్లుఅర్జున్. మొత్తానికి ఇన్ని రోజులు సస్పెన్స్‌లో పెట్టినా ఒకేసారి విక్రమ్ కె.కుమార్, త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్లతో సినిమాలు ఒకే చేసి అభిమానులను సంతోషంలో ముంచేస్తున్నాడు బన్నీ.

Comments

comments