Home సినిమా జూన్ 23 న వస్తున్న అల్లు అర్జున్ ‘DJ దువ్వాడ జగన్నాథమ్’

జూన్ 23 న వస్తున్న అల్లు అర్జున్ ‘DJ దువ్వాడ జగన్నాథమ్’

DJ Duvvada Jagannatham Movie Stills

రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు మూవీస్ తో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న మూవీ ‘DJ దువ్వాడ జగన్నాథమ్’. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ మూవీ నిర్మాత దిల్ రాజు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ కీలక సన్నివేశాల చిత్రీకరణ… ప్రస్తుతం జరుగుతోంది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.

ఇదివరకే రిలీజయిన టీజర్, ఫస్ట్ లుక్ లకు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం, అల్లు అర్జున్, హరీశ్, దిల్ రాజు, దేవిశ్రీప్రసాద్ కాంబో లో వస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై భారీగానే అంచనాలున్నాయి.

అల్లు అర్జున్ సరసన.. ముకుంద హీరోయిన్ పూజా హెగ్దే నటిస్తున్నది. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలను త్వరలోనే పూర్తి చేసి జూన్ 23 న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది.