Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

అమెరికా వెళ్తున్న అల్లు అర్జున్

AA

డిజె… దువ్వాడ జగన్నాథమ్’తో అల్లు అర్జున్ ఇటీవల మంచి హిట్‌ను అందుకున్నాడు. ఈ చిత్రం మంచి కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ప్రస్తుతం అల్లుఅర్జున్ తన నెక్స్ మూవీ ‘నా పేరు సూర్య… నా ఇల్లు ఇండియా’ సినిమాపై దృష్టిపెట్టాడు. ఈ సినిమాలో బన్నీ ఆర్మీ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ పాత్రను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దే పనిలో పడిపోయాడు. ఆర్మీ ఆఫీసర్ పాత్ర అంటే ఏదో మిలటరీ యూనిఫాంలో దర్శనమివ్వడంతో సరిపెట్టకుండా ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ముంబయ్‌లో ఉంటూ ఆర్మీ విధుల్లో శిక్షణ పొందుతున్నాడు. తర్వాత ఇదే పనిపై యుఎస్ కూడా వెళ్లనున్నాడు. అక్కడ ఆర్మీ అధికారుల జీవితాన్ని దగ్గర నుంచి పరిశీలించి పోరాటాల్లో వారు అనుసరించే టెక్నిక్స్ నేర్చుకునేందుకు ప్లాన్ చేశాడని తెలిసింది. ‘టెంపర్’ సినిమా రైటర్ వక్కంతం వంశీ ఈ సినిమాను తొలిసారిగా డైరెక్ట్ చేయనున్నాడు. గీతా ఆర్ట్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇంతకుముందు అల్లు అర్జున్ ‘సరైనోడు’లో మాజీ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. ఆ సినిమాలో బన్నీ కొన్ని సీన్లలో మిలటరీ యూనిఫామ్‌లో కనిపిస్తాడు. అందులో మామూలు ఫైట్సే తప్ప యుద్ధ సన్నివేశాలు అంటే ఏమీ లేవు. అయితే ‘నా పేరు సూర్య…’ కోసం ప్రత్యేకంగా అల్లు అర్జున్ శిక్షణ తీసుకుంటున్నాడంటే ఇందులో వార్ సీన్స్ ఉంటాయని ప్రేక్షకులు, అభిమానులు ఆశించవచ్చు.

Comments

comments