Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

అల్లు అర్జున్-లింగుస్వామి చిత్రం

allu-arjunవిశాల్‌తో ‘పందెం కోడి’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌నిచ్చిన డైరెక్టర్ లింగుస్వామి. తమిళ్‌లో స్టార్ డైరెక్టర్ అయిన ఆయన అల్లుఅర్జున్‌తో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు బన్నీ ఇదివరకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇటీవల సూర్యతో లింగుస్వామి తీసిన ‘సికిందర్’ ఫ్లాపుగా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఆయన అల్లు అర్జున్‌తో చేస్తున్న చిత్ర మిది. సినిమా కథ బన్నీకి ఎంతో నచ్చిందట. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ చిత్రం తెరకెక్క నుంది. తమిళ్‌లో కూడా మార్కెట్‌ను పెంచుకోవాలను కుంటున్న అల్లుఅర్జున్… లింగుస్వామి చిత్రంతో అక్కడ తన సత్తాను చాటాలనుకుం టున్నాడు. గీతా ఆర్ట్, స్టూడియో గ్రీన్ బ్యానర్‌లు కలిసి దీన్ని నిర్మించనున్నాయి. బోయపాటి శ్రీనుతో అల్లు అర్జున్ చేస్తున్న ‘సరైనోడు’ విడుదలైన తర్వాత ఈ సినిమా తెరకెక్కుతుంది. ఏప్రిల్ చివరిలోపు ఈ లింగుస్వామి చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది.

Comments

comments