Search
Wednesday 21 November 2018
  • :
  • :

బ్రేకింగ్ న్యూస్…. అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథం’ స్టోరీ లీక్..!!

allu-arjun-new-movie-story-

సరైనోడు మూవీ తర్వాత సరైన మూవీ తో వస్తున్నాడు అల్లు అర్జున్. హరీశ్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథం మూవీ లో నటిస్తున్నాడు అల్లు అర్జున్. మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.

అయితే, ఈ మూవీ స్టోరీ లీకయ్యిందంటూ సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు తెగ పడిపోతున్నాయి. సోషల్ మీడియా పోస్టుల ప్రకారం స్టోరీ ఇదే….

ఊళ్లోనే డ్యాన్సర్ గా తన జీవితాన్ని గడుపుతున్న జగన్నాథం(అల్లు అర్జున్) చిన్నప్పటి నుంచి అన్ని రకాల డ్యాన్సులను నేర్చుకుంటాడట. అయితే, ఎలాగైనా పేద్ద డ్యాన్సర్ అవ్వాలనే ఆశతో హైదరాబాద్ లో అడుగుపెడతాడట. అయితే, హైదరాబాద్ లో కొంత మంది బ్రోకర్ల చేతిలో మోసపోయి రోడ్డున పడతాడట జగన్నాథం.

అప్పుడే హీరోయిన్ పరిచయమవుతుందట మనోడికి. మనోడి టాలెంట్ గుర్తించిన హీరోయిన్ జగన్నాథానికి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుందట. కాని, ఆ అమ్మాయి తోటే మనోడికి కొన్ని సమస్యలు వస్తాయట. ఆ అమ్మాయి తో హీరోకు వచ్చిన సమస్యలు ఏంటి? వాటిని హీరో ఎలా ఎదుర్కొన్నాడనేదే ఈ మూవీ స్టోరీనట.

ఇక ఈ మూవీ విషయానికొస్తే…. అల్లు అర్జున్ డ్యాన్సులు మాత్రం ఇరగదీశాడని సోషల్ మీడియా కోడైకూస్తుంది. ఇదివరకు అల్లు అర్జున్ నటించిన అన్ని సినిమాల కంటే ఈ మూవీ లో ది బెస్ట్ డ్యాన్సులు ప్రేక్షకులను అలరించబోతున్నాయట.

Comments

comments