Home సినిమా క్రేజీ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ?

క్రేజీ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ?

Allu Arjun next Film With Director Sujit
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఇప్పటివరకు రామ్‌చరణ్, ఎన్టీఆర్, మహేష్‌బాబు వంటి స్టార్స్ సినిమాలు చేశారు. రవితేజ, నాగచైతన్య ఇప్పటికే ఈ బ్యానర్‌లో సినిమాలు పూర్తిచేయగా… విజయ్ దేవరకొండ, సాయిధరమ్‌తేజ్ కూడా ఈ బ్యానర్‌లో సినిమాలు చేస్తున్నారు. ఇలా వరుసగా హీరోలు అందరినీ కవర్ చేస్తున్న ఈ బ్యానర్ అల్లు అర్జున్‌తో మాత్రం సినిమా చేయలేకపోయింది. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై బన్నీ హీరోగా ఓ సినిమా రాబోతోంది. మైత్రీ నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్స్ అల్లు అర్జున్ వద్ద దాదాపు ఏడాదిగా ఉంది. కానీ సినిమా మాత్రం సెట్ కాలేదు. ఇప్పుడు దర్శకుడు సుజిత్ ఆ సినిమాను సెట్ చేశాడని తెలిసింది. ప్రస్తుతం ప్రభాస్‌తో ‘సాహో’ సినిమా చేస్తూ బిజీగా ఉన్న ఈ యంగ్ డైరెక్టర్ బన్నీకి అదిరిపోయే స్టోరీ లైన్ చెప్పాడట.

అల్లుఅర్జున్‌కు కూడా ఆ కాన్సెప్ట్ బాగా నచ్చిందని తెలిసింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే బన్నీ-సుజిత్ కాంబినేషన్‌లో సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పైనే ఉంటుంది. ఎందుకంటే సుజిత్ వద్ద కూడా మైత్రీ ఇచ్చిన అడ్వాన్స్ ఉంది. కాకపోతే ఈ సినిమా సెట్స్‌పైకి రావడానికి చాలా సమయం పడుతుంది. ‘సాహో’ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న థియేటర్లలోకి వస్తుంది. ఆతర్వాత మాత్రమే బన్నీ కోసం వర్క్ చేయగలడు సుజిత్. ఈ గ్యాప్‌లో త్రివిక్రమ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్ బ్యానర్‌పై అల్లు అర్జున్ ఓ సినిమా చేస్తాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన జనవరి 1న వచ్చే అవకాశం ఉంది.

Allu Arjun next Film With Director Sujit