Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

క్రిష్‌తో నెక్ట్స్ మూవీ?

aa
ఒక సినిమా పూర్తయిన తర్వాత మరో సినిమాను మొదలుపెడతాడు స్టార్ హీరో అల్లు అర్జున్. కథల ఎంపికలో జాగ్రత్తగా ఉండే ఆయన ఒక సినిమా చేస్తుండగా మరో సినిమా పని మొదలుపెట్టడు. కొత్త సినిమా కోసం దర్శకులతో చర్చలు జరపడం, స్క్రిప్ట్ చర్చల్లో కూడా పాల్గొంటూ తనకు ఏది సరిపోతుందో ఆ చిత్రాన్ని ఎంపికచేసుకుంటాడు. ఇదే తన సక్సెస్ సీక్రెట్ అని అల్లుఅర్జున్ బలంగా నమ్ముతాడు. గత ఏడాది మధ్య నుంచి ‘నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా’ సినిమాలో బిజీగా ఉన్న బన్నీ… ఆతర్వాత ఫలానా దర్శకుడితో సినిమా చేస్తాడంటూ రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే అవన్నీ అబద్ధమే అని తేలిపోయింది. ఇప్పటిదాకా ఏ సినిమా కూడా ఖరారు కాలేదు. అయితే మరికొన్ని రోజుల్లో ‘నా పేరు సూర్య…’ను పూర్తిచేయబోతున్న అల్లుఅర్జున్ తన నెక్ట్స్ సినిమాకు సూచనప్రాయంగా ఓకే చెప్పినట్లు సమాచారం. విలక్షణ దర్శకుడు క్రిష్‌తో అతను ఓ సినిమా చేస్తాడట. ప్రస్తుతం బాలీవుడ్‌లో కంగనారనౌత్‌తో ‘మణికర్ణికః ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు ఈ దర్శకుడు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ఈ ఏడాది ద్వితీయార్థంలో అల్లుఅర్జున్‌తో సినిమాను మొదలుపెడతాడు క్రిష్.

Comments

comments