Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

అల్లు అర్జున్, ఎన్టీఆర్ నా ఫేవరేట్ హీరోలు

sonakshi

అశ్విని క్రియేషన్స్ బ్యానర్‌పై జి.లక్ష్మి నిర్మాతగా శివ గంగాధర్ దర్శకత్వంలో మహీధర్, సోనాక్షి సింగ్ రావత్‌లను తెలుగు తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కిన చిత్రం ‘నా లవ్ స్టోరీ’. మునుపెన్నడూ చూడని విధంగా విలక్షణంగా తెరకెక్కిన ఈ ప్రేమ కథా చిత్రం ఈనెల 29న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సోనాక్షి సింగ్ రావత్ చెప్పిన విశేషాలు…

16 ఏళ్లకే మోడలింగ్‌లోకి…
మాది రాజస్తాన్. కానీ పుట్టి పెరిగింది, చదువుకుంది మాత్రం ముంబయిలోనే. ప్రస్తుతం బిజినెస్ మేనేజ్‌మెంట్ థర్డ్ ఇయర్ చేస్తున్నాను. 16 సంవత్సరాల వయసులోనే మోడలింగ్‌లోకి వచ్చాను. యాడ్స్, మోడలింగ్‌లో ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాను.
ఆవిధంగా సినిమాలోకి…
నా మొదటి సినిమా ఇది. ఓ తెలుగు సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతున్నారని తెలిసి ఫొటోలు పంపాను. ఈ సినిమా టీమ్ చూసిన చివరి ఫొటో నాదే. వారికి నచ్చడంతో హీరోయిన్‌గా ఓకే చేశారు. ఆవిధంగా ఈ సినిమాలో నటించాను.
మధ్యతరగతి అమ్మాయిగా…
సినిమాలో ఒక మధ్యతరగతి అమ్మాయి పాత్రలో నటించాను. అందరితో కలిసి తిరగకుండా… ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్ ఉన్నఅమ్మాయిగా కనిపిస్తాను. ఎక్కడికి వెళ్లొద్దు, ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి… నీ బెస్ట్ ఫ్రెండ్‌ని కలవాలన్నా తననే ఇంటికి రమ్మని ఆమె తండ్రి చెబుతుంటాడు. ఈ పాత్ర ప్రేక్షకులకు ఏమేరకు నచ్చుతుందో చూడాలి.
చాలా తెలుగు సినిమాలు చూశా…
ఈ సినిమా చేసే ముందు చాలా తెలుగు సినిమాలు చూశాను. హిందీ డబ్బింగ్‌లో తెలుగు మూవీస్ చూసేదాన్ని. డైరెక్ట్‌గా తెలుగులో అంటే బాహుబలి, అర్జున్‌రెడ్డి సినిమాలను థియేటర్లలో చూశాను.
వారే నా ఫేవరేట్…
అల్లుఅర్జున్, ఎన్టీఆర్ నా ఫేవరేట్ హీరోలు. వారిద్దరూ బాగా డ్యాన్స్ చేస్తారు. చిన్నప్పటి నుంచి శ్రీదేవిని ఇష్టపడతాను. ఆమె తర్వాత సుస్మితాసేన్, ప్రియాంకా చోప్రాలు నా ఫేవరేట్ హీరోయిన్లు.

Comments

comments