Home తాజా వార్తలు ఆర్య‌-సాయేషా సంగీత్ లో సందడి చేసిన బన్ని

ఆర్య‌-సాయేషా సంగీత్ లో సందడి చేసిన బన్ని

Allu-Arjun

హైదరాబాద్: తమిళ నటుడు ఆర్య‌(38), నటి స‌యేషా సైగ‌ల్‌(21)ల వివాహం నేడు హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. మూడు రోజుల నుండి వీరి వివాహా కార్య‌క్ర‌మాలు మొదలైనాయి. శుక్ర‌వారం జ‌రిగిన ప్రీ వెడ్డింగ్ వేడుక‌కి బాలీవుడ్ సెల‌బ్రిటీలు సంజ‌య్ ద‌త్‌, ఖుషీ క‌పూర్‌, ఆదిత్యా పంచోలితో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలు హాజ‌ర‌య్యారు. శనివారం జరిగిన సంగీత్ వేడుక‌ కార్యక్రమానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజ‌ర‌య్యారు. ఆర్య‌,సాయేషాతో క‌లిసి బ‌న్నీ దిగిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Allu Arjun Participated in Arya sayesha Sangeeth