Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

అదరహో… అల్లు అర్జున్ స్టెప్స్

Sarrainoduబోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లుఅర్జున్ కథానాయకుడిగా గీతా ఆర్ట్ బ్యానర్‌లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రం ‘సరైనోడు’. తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం పాటల్ని ఏప్రిల్ 1న నేరుగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 10న వైజాగ్‌లో గ్రాండ్‌గా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను చేస్తున్నారు. ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా విడుదలైన బ్లాక్‌బస్టర్ అనే లిరిక్‌తో వచ్చే సాంగ్ టీజర్‌లో హీరోయిన్ అంజలితో.. అల్లుఅర్జున్ వేసిన స్టెప్స్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ట్విట్టర్, ఫేస్‌బుక్, సోషల్ మీడియా మాధ్యమాలలో ఈ టీజర్ హల్‌చల్ చేస్తోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్ సింగ్, క్యాథరిన్ అందచందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ “ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే ఇప్పుడు విడుదల చేసిన అల్లుఅర్జున్, అంజలిల సాంగ్ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. అదిరిపోయే సాంగ్స్‌ను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించాడు. ఈ ఆడియోను ఏప్రిల్ 1న డైరెక్టుగా మార్కెట్లోకి విడుదల చేసి, ఏప్రిల్ 10న వైజాగ్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నాం. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఏప్రిల్ 22న విడుదల చేయబోతున్నాం. రకుల్‌ప్రీత్ సింగ్, క్యాథరిన్ గ్లామర్, తమన్ సంగీతం, రిషి పంజాబీ ఛాయాగ్ర హణం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది”అని అన్నారు. శ్రీకాంత్, ఆది పినిశెట్టి, సాయికుమార్, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, సురేఖావాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్‌ః కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్‌ః రామ్-లక్ష్మణ్, రవివర్మ, డైలాగ్స్‌ః ఎం.రత్నం.

Comments

comments