Home తాజా వార్తలు ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్

ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్

Allu Arjun And Priya Prakash Varrierదేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘ఒరు ఆడార్ లవ్’ ప్రచార చిత్రంలో కొంటెగా కంటి సైగతో మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. అంతేకాకుండా 2018లో గూగుల్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఒకరిగా ఓ ఘనతను సాధించింది. ‘ఒరు ఆడార్ లవ్’లో కేవలం 27 సెకన్ల పాటు ఆమె చేసిన కనుసైగకు రెండు రోజుల్లోనే 45 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇప్పటికి రెండు కోట్ల మంది ఈ వీడియోను చూశారు. ఇలా ప్రస్తుతం యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్న ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన ‘ఒరు ఆడార్ లవ్’ చిత్రాన్ని తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో విడుదల చేస్తున్నారు.

మలయాళంలో క్రేజీ డైరెక్టర్ ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిర్మాతలు ఎ.గురురాజ్, సి.హెచ్.వినోద్ రెడ్డి సుఖీభవ సినిమాస్ బ్యానర్‌పై ప్రేమికుల దినం రోజైన ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. మలయాళ వర్షన్ కూడా అదే రోజున విడుదల కానుంది. ఇక ఈ సినిమా ఆడియో వేడుకను హైదరాబాద్‌లోని జెఆర్‌సి కన్వెన్షన్ సెంటర్‌లో ఈనెల 23న వైభవంగా నిర్వహించేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నూరిన్ షెరిఫ్, రోషన్, మాథ్యూ జోసఫ్, వైశాఖ్ పవనన్, మైఖేల్ యాన్ డేనియల్, దిల్ రూపా, హరీష్ పెరుమన్న తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరాః శీను సిద్ధార్థ్, సంగీతంః షాన్ రెహమాన్, ఎడిటింగ్‌ః అచ్చు విజయన్.

Allu Arjun to attend Priya Prakash Varrier Oru Adaar love